IPL 2023: థ్రిల్లింగ్ మ్యాచ్‌లతో, గొడవలతో హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్‌కు ఓ భారత స్టార్ క్రికెటర్ దూరం అయ్యాడు.
ఎప్పుడూ లేనంత వాడీవేడిగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ సాగుతోంది. క్రికెట్ అభిమానులే కాదు.. మైదానం క్రికెటర్లు సైతం యుద్దం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గొడవలు, జరిమానాలతో ఈ సారి ఐపీఎల్ సీజన్ వేరే లెవెల్‌లో జరుగుతోంది. రసవత్తరంగా సాగుతున్న ఈ ఐపీఎల్‌కు భారత స్టార్ ప్లేయర్ దూరం అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న జయదేవ్ ఉనద్కట్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ.. గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.
నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా కాలికి తాడు తగిలి జయదేవ్ కింద పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతని ఎడమ భుజానికి గాయమైంది. కాగా.. జూన్ 7 నుంచి జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో ఆడే జట్టులో జయదేవ్ సభ్యుడి కావడంతో అతనిపై ఒత్తిడి లేకుండా, గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు ఐపీఎల్ నుంచి తప్పించి.. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్‌కు సిద్ధం అయ్యేందుకు జయదేవ్ అక్కడే రియాబిటేషన్ క్యాంప్‌లో ఉండనున్నాడు. అయితే.. జయదేవ్ డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు కోలుకోకుంటే.. అతని స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jaydev Unadkat, who was named in India’s World Test Championship 2023 final squad, injured his shoulder in the LSG training camp yesterday.
Get well soon @JUnadkat.
📸: Jio Cinema pic.twitter.com/irondBd1YF
— CricTracker (@Cricketracker) May 1, 2023
Jaydev Unadkat ruled out of IPL 2023 due to left shoulder injury. (Reported by Espncricinfo).
— Muffadal Vohra (@Muffadal_Vohra1) May 3, 2023