ప్రస్తుతం ప్రపంచ టాప్ స్పిన్నర్లలో ఒకడైన జడేజా తన స్పిన్ మ్యాజిక్ ని మరో సారి చూపించాడు. అద్భుతమైన బంతితో లక్నో బ్యాటర్ స్టోయినీస్ ని బోల్తా కొట్టించి వావ్ అనిపించాడు.
ఐపీఎల్ లో నేడు డబల్ ధమాకాకి రంగం సిద్ధమైంది. వీకెండ్ కాకపోయినా ఈ రోజు రెండు మ్యాచులతో ప్రేక్షకులని అలరించనుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తో, లక్నో సూపర్ జయింట్స్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన లక్నో జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వస్తుంది. జట్టులో ఏ ఒక్కరూ కూడా కాసేపైనా గ్రీజ్ లో నిలబడలేకపోతున్నారు. కెప్టెన్ రాహుల్ లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టు క్యూ కట్టేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా.. చెన్నై స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన ఒక బంతిని చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.
చెన్నై సూపర్ కింగ్స్ లక్నో మీద తన ప్రతాపం చూపిస్తుంది. ప్రస్తుతం 16 ఓవర్లలో కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం నికోలస్ పూరన్, బదోని నత్త నడకన బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచులో జడేజా.. స్టోయినీస్ వికెట్ తీయడం ఈ ఇన్నింగ్స్ కె హైలెట్ గా మారింది. లెగ్ మీదకు వేసిన ఈ బంతి ఊహించని విధంగా టర్నై ఆఫ్ సైడ్ వైపుకు వెళ్లి ఆఫ్ స్టంప్ ని గిరాటేసింది. దీంతో కాస్త షాక్ కి గురైన స్టోయినీస్ జడేజా వైపు అంతే చూస్తూ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ స్పిన్ ఏంట్రా బాబు అన్నట్లుగా జడేజాకేసి చూసాడు. ప్రస్తుతం ఈ ఐపీఎల్ ల్లో స్టోయినీస్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ పవర్ హిట్టర్ వికెట్ తీయడం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ జడేజా తన మ్యాజిక్ తో స్టోయినీస్ ని బోల్తా కొట్టించిన విధానం వారెవ్వా అన్నట్లుగా ఉంది. అప్పటికే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న లక్నో జట్టు స్టోయినీస్ వికెట్ మరింత కష్టాల్లోకి నెట్టింది. మరి జడేజా వేసిన ఈ బంతి మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
𝗣.𝗘.𝗔.𝗖.𝗛!
That was an epic delivery from @imjadeja 🔥🔥
Follow the match ▶️ https://t.co/QwaagO40CB #TATAIPL | #LSGvCSK pic.twitter.com/dhPSVB4BuF
— IndianPremierLeague (@IPL) May 3, 2023