ఐపీఎల్ 2023 ప్రారంభానికి అంతా సిద్ధం అయ్యింది. ఇక 2023 ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయేది ఆ జట్టే అని జోస్యం చెబుతున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజం, మాజీ బ్యాటర్ జాక్వెస్ కల్లీస్. ఫైనల్ కు వెళ్లేది ఆ రెండు జట్లేనని బల్లగుద్ది చెబుతున్నాడు. మరి ఈసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకునే ఆ జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2023 ప్రారంభానికి అంతా సిద్ధం అయ్యింది. ఇప్పటికే అన్ని జట్లు తమ అస్త్రశస్త్రాలను రడీ చేసుకున్నాయి. ఇక ప్రారంభ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది నరేంద్ర మోదీ స్టేడియం. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో ఢీ కొనబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ క్రమంలోనే ఈసారి ఐపీఎల్ కప్ కొట్టబోయేది ఎవరని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక 2023 ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయేది ఆ జట్టే అని జోస్యం చెబుతున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజం, మాజీ బ్యాటర్ జాక్వెస్ కల్లీస్. ఫైనల్ కు వెళ్లేది ఆ రెండు జట్లేనని బల్లగుద్ది చెబుతున్నాడు. మరి ఈసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకునే ఆ జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రికెట్ ప్రపంచ మెుత్తం ఇప్పుడు ఒక్కటే నామంతో మారుమ్రోగిపోతోంది. ఆ నామమే ఐపీఎల్. మార్చి 31 సాయంత్రం 7 గంటలకు 2023 ఐపీఎల్ 16వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మాజీలు ఏ జట్టు ఈసారి కప్ కొడుతుందో జోస్యం చెప్పడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రీకా మాజీ ప్లేయర్, స్టార్ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లీస్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచే జట్టు ఏదో చెప్పాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ..”2023 ఐపీఎల్ ఫైనల్ ల్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి ఈసారి ఐపీఎల్ కప్ ను ఎగరేసుకుపోతుంది” అంటూ జోస్యం చెప్పాడు కల్లీస్.
ఇక ఈ దక్షిణాఫ్రికా దిగ్గజం చెప్పినట్లుగా.. రెండు జట్లు ప్రస్తుతం బలంగానే కనిపిస్తున్నాయి. అయితే పంత్ గైర్హాజరీతో ఢిల్లీ జట్టు బలహీనంగా మారింది. అయినప్పటికీ డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, పావెల్, పృథ్వీ షా, రూసో, మనీష్ పాండే, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్ లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ లో సైతం ఖలీల్ అహ్మద్, కుల్దిప్ యాదవ్, ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జై, ముస్తాఫిజుర్ రెహ్మన్, ఇషాంత్ శర్మ, సకారియాలతో స్ట్రాంగ్ గా ఉంది.
అటు ముంబై టీమ్ సైతం భీకరమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ తో శత్రుదుర్భేద్యంగా ఉంది. రోహిత్ శర్మ, డెవాల్ట్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, జోఫ్రా ఆర్చర్, బెహ్రండూప్, పియూష్ చావ్లాతో బలంగా కనిపిస్తోంది. ఇక ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం ఈసారి ఐపీఎల్ ఏ జట్టు గెలుస్తుందో చెప్పుకొచ్చాడు. మైఖేల్ వాన్ 2023 ఐపీఎల్ ట్రోఫీ రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుంది అంటూ జోస్యం చెప్పాడు. మరి ఈసారి ఐపీఎల్ ఏ జట్టు కైవసం చేసుకుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Jacques Kallis prediction for IPL 2023:
Final – Mumbai Indians Vs Delhi Capitals.
Champions – Delhi Capitals.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 30, 2023
Can’t wait for the IPL to start .. Looking forward to being part of the @cricbuzz team .. I thinks it’s going to be @rajasthanroyals year .. they will be lifting the trophy in late May .. #OnOn #IPL2023
— Michael Vaughan (@MichaelVaughan) March 29, 2023