Ishant Sharma, Virat Kohli: తనను ఏమైనా అంటే ఎంత పెద్ద వ్యక్తిని కూడా లెక్కచేయని కోహ్లీ.. స్నేహానికి ఇచ్చే విలువ ఇది అంటూ ఆ వీడియోను కోహ్లీ అభిమానులు షేర్ చేస్తున్నారు.
గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ ఉంటే ఆ ఎనర్జీ, జోష్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడు పేలుదాం అని లోడ్ చేసిన గన్‌లా ఉంటాడు. అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. ఆటతో పాటు గొడవలతోనూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. మొదల టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా ఉన్న సౌరవ్ గంగూలీకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా విమర్శల పాలైన కోహ్లీ.. ఆ తర్వాత.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ క్రికెటర్ నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, గౌతమ్ గంభీర్‌తో గొడవ పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లీ-ఇషాంత్ శర్మకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో కోహ్లీ.. ఢిల్లీ ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించాడు. ఈ క్రమంలో ఆ గ్రూప్‌లో ఉన్న ఇషాంత్ శర్మ.. కోహ్లీని దేంతోనో కొట్టాడు. దానికి కోహ్లీ నవ్వాడు తప్పితే.. అగ్రెసివ్‌గా రియాక్ట్ కాలేదు. అయితే కోహ్లీ-ఇషాంత్ శర్మ మధ్య చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. పైగా ఇషాంత్ కోహ్లీకి సీనియర్ కూడా. తనను ఏమైనా అంటే ఎంత పెద్ద వ్యక్తిని కూడా లెక్కచేయని కోహ్లీ.. స్నేహానికి ఇచ్చే విలువ ఇది అంటూ ఆ వీడియోను కోహ్లీ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ-ఇషాంత్ పాత ఫొటోలు సైతం ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇద్దరూ ఢిల్లీకి చెందిన వారనే విషయం తెలిసిందే.
ఆర్సీబీ-ఢిల్లీ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో దాదా విషయంలో కోహ్లీ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక ఇటివల జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ ఆర్సీబీపై అద్భుత విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ గంగూలీతో షేక్ ఇవ్వడంతో విశేషం. ఇద్దరి మధ్య మళ్లీ మామూలు పరిస్థితులు రావాలని క్రికెట్ అభిమానులు సైతం కోరుకుంటున్నారు. కాగా.. కోహ్లీ-ఇషాంత శర్మ మధ్య జరిగిన సంభాషణ దేని గురించనే విషయంపై కూడా క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా కాలంగా వీళ్లద్దరూ కలిసి క్రికెట్ ఆడలేదు. అయినా కూడా వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Forget dada and virat.
Here ishant hitting virat. The much awaited lafda between rcb and dc. 😂😂 #DCvRCB #dcvsrcb pic.twitter.com/TNmKY0poeD— Gajal (@KLaasyGajal) May 6, 2023