ముంబై ఇండియన్స్ భారీ టార్గెట్లను ఛేదిస్తూ ప్రత్యర్థులకు ప్రమాద సంకేతాలు పంపుతోంది. వరుసగా రెండోసారి 200 పైచిలుకు రన్స్ లక్ష్యాన్ని ఛేదించిందా జట్టు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరోసారి అద్భుతం చేసింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 215 రన్స్ టార్గెట్‌ను ఉఫ్‌మని ఊదేసింది. మరో 7 బాల్స్ ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సారథి రోహిత్ శర్మ డకౌట్ అయినా.. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ముంబైని ఆదుకున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదడంతో వీళ్ల మధ్య అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. ఈ పార్ట్నర్షిప్ ఆధారంగా ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి 200 రన్స్ పైచిలుకు స్కోరును అవలీలగా ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్ పార్ట్నర్ సూర్య కుమార్ యాదవ్ విషయంలో కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అతడు నిరాశకు గురవ్వడానికి ఒక కారణం ఉంది.
మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ విషయంలో తన నిరాశకు గల కారణాన్ని ఐపీఎల్ వీడియోలో వ్యక్తపరచాడు ఇషాన్ కిషన్. ఎప్పుడైతే తాను రన్స్ చేస్తానో అప్పుడే సూర్య బ్యాట్ కూడా గర్జిస్తుందని, రన్స్ వర్షం కురిపిస్తుందన్నాడు ఇషాన్ కిషన్. తనకు రావాల్సిన క్రెడిట్‌నంతా సూర్య కుమార్ కొట్టేస్తున్నాడని, హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అయితే సూర్య బ్యాటింగ్ పైనా ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఇషాన్. అతడి బ్యాటింగ్ అద్భుతం అంటూ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఇకపోతే, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య కేవలం 31 బాల్స్‌లో 66 రన్స్ చేశాడు. అతడు ఏకంగా 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదడం విశేషం. ప్రత్యర్థి జట్టు స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ వేసిన 13వ ఓవర్లో ఏకంగా 23 రన్స్ పిండుకున్నాడు సూర్య. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ విధ్వంసం ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
Explosive partnership 🔥
3️⃣6️⃣0️⃣ show 💥
Shining bright in presence of lucky charm father 😃Presenting Magical Mohali tales with @ishankishan51 & @surya_14kumar 👌🏻👌🏻
Full Interview 🎥🔽 #TATAIPL | #PBKSvMI | @mipaltan https://t.co/Y24cYFIoCd pic.twitter.com/syvYwOsS6w
— IndianPremierLeague (@IPL) May 4, 2023