Prediction, CSK vs GT: ఐపీఎల్ 2023లో తొలి మ్యాచ్ చెన్నై-గుజరాత్ మధ్య జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టేదో అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో ఉంది. రెండు జట్ల బలం బలహీనతలు అంచనా వేస్తే.. ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఉందంటే..
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2023 సమరం మొదలుకానుంది. సాయంత్రం 6 గంటల నుంచి ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమాల తర్వాత.. తొలి మ్యాచ్‌కు టాస్ పడనుంది. మొత్తం 52 రెండు రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా.. ఐపీఎల్‌పై భారీ క్రేజ్ ఏర్పడింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. గుజరాత్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. చెన్నైసూపర్ కింగ్స్‌కు ధోని కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ఆరంభ పోరులో విజేతగా నిలిచేది ఎవరో? ఎవరి బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు విశ్లేషణ చేద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్..
ధోని సారథ్యంలోని చెన్నై ప్రధాన బలం ఆల్‌రౌండర్లు. రవీంద్ర జడేజా, శివమ్ దుబే, మొయిన్ అలీ, డెవాన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, బెన్ స్టోక్స్‌తో దుర్బేధ్యంగా ఉంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు కాన్వె, రుతురాజ్ గైక్వాడ్ జోడీ బలంగా ఉంది. అంబటి రాయుడు, ధోని ఉండనే ఉన్నాడు. ఇక బౌలింగ్‌లో దీపక్ చాహర్, మహీష్ తీక్షణ, ప్రశాంత సోలంకి ఉన్నారు. దీంతో.. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగనుంది. అయితే.. స్టోక్స్ బౌలింగ్ చేస్తాడో లేదో అనే అనుమానం ఉంది. అతను బౌలింగ్ చేయకుంటే.. చెన్నైకు అది పెద్ద మైనస్. అయితే.. ధోని కెప్టెన్సీ చాతుర్యం చెన్నైకి అదనపు బలం.
సీఎస్‌కే ప్లేయింగ్ ఎలెవన్(అంచనా): కాన్వె, రుతురాజ్, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, ధోని, డెవాన్ ప్రిటోరియస్, జడేజా, దీపక్ చాహర్, సిమ్రజిత్ సింగ్, సోలంకి.
గుజరాత్ టైటాన్స్..
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న గుజరాత్ టైటాన్స్ భారీ కాన్ఫిడెన్స్‌తో ఆడే అవకాశం ఉంది. పైగా జట్టు కూడా చాలా పటిష్టంగా ఉంది. గిల్, పాండ్యా, కేన్ విలియమ్సన్, మ్యాథ్యూ వేడ్‌పైనే గుజరాత్ బ్యాటింగ్ బలం ఆధారపడింది. ఉంది. గుజరాత్‌కు బౌలింగ్ ప్రధాన బలం.. రషీద్ ఖాన్, పాండ్యా, షమీ, జోసెఫ్‌తో గుజరాత్ బౌలింగ్ ఎటాక్ పటిష్టంగా ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు హోం గ్రౌండ్ కావడం కలిసొచ్చే అంశం. అలాగే గురువారం రాత్రి వర్షం పడటంతో టాస్ గెలిచిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉండొచ్చు.
గుజరాత్ ప్లేయింగ్ ఎలెవన్(అంచనా): గిల్, సాహా, విలియమ్సన్, హార్దిక్ పాండ్యా, మ్యాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, యష్ దయల్, జోసెఫ్, షమీ.
ప్రెడిక్షన్: ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచే అవకాశం ఉంది.