IPL 2023: డబ్బే ప్రధానంగా సాగే వ్యాపార క్రీడ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఆటగాళ్లకు కోట్ల కొద్ది డబ్బు, క్రికెట్ అభిమానులకు వినోదం.. బీసీసీఐ ఆదాయ వనరు.. అలాగే ఫ్రాంచైజీలకు వ్యాపార వస్తువు ఐపీఎల్. అయితే.. దీని వెనుక చీకటి కోణాలు ఎలా ఉంటాయో మరోసారి బయటపడింది.
క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ వినోదాన్ని అందించే ఐపీఎల్ వెనుక అనేక చీకటి కోణాలు ఉంటాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. కొన్ని సార్లు అవి నిజమే అనే సంఘటనలు జరుగుతున్నాయి, పలు వార్తలు కూడా బయటికి వస్తున్నాయి. పక్కా కమర్షియల్ లీగ్ అయిన ఐపీఎల్ గురించి తాజాగా మరో సంచలనకర విషయం వెలుగులోకి వచ్చింది. క్రికెటర్లకు కోట్లు ముట్టజెప్పి.. వారితో వందల, వేల కోట్ల వ్యాపారం చేస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు ఇప్పుడు ఏకంగా కొత్త ప్రణాళికను వేసినట్లు లండన్ టైమ్స్ అనే ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది.
ఐపీఎల్‌లో ఆడుతున్న కొంతమంది ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు భారీ ఆఫర్ ఇచ్చిందని ఆ వార్త సారాంశం. సదరు క్రికెటర్లు ఇకపై ఇంగ్లండ్‌కు ఆడకుండా కేవలం ఐపీఎల్‌లో మాత్రమే, తమ ఫ్రాంచైజీలకు ఆడాలని, అందుకోసం ఏడాది ఏకంగా రూ.50 కోట్లు ముట్టజెబుతామని ప్రతిపాదనను వారి ముందు ఉంచినట్లు సమాచారం. అలాగే.. పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లలో సైతం పాల్గొనకూడదనే షరతు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. క్రికెట్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు నాశనం చేశాలా ఉన్నాయంటూ పలువురు క్రికెట్ నిపుణులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. ఏఏ ఫ్రాంచైజీలు ఏఏ క్రికెటర్లతో ఈ ప్రతిపాదన చేసిన విషయాలపై ఇంకా స్పష్టత లేకపోయినా.. ఇది తేలిగ్గా కొట్టిపారేసే విషయం కాదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కాగా, పీఎస్‌ఎల్, బీపీఎల్ మినహా దాదాపు అన్ని టీ20 లీగ్‌లలో భారత ఫ్రాంచైజ్‌లకు జట్లు ఉన్న విషయం తెలిసిందే. ఇటివల మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆరుకు ఆరు జట్లు మనవే. అలాగే యూఏఈ వేదికగా జరిగినఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో కూడా మన ఫ్రాంచైజ్‌లు పాల్గొన్నాయి. వెస్టిండీస్ వేదికగా జరిగిన కరేబియర్ లీగ్‌లోనూ మన ఫ్రాంచైజ్‌లు జట్లు ఉన్నాయి. దీంతో కొంతమంది స్టార్ క్రికెటర్లతో లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ చేసుకోవాలని కొన్ని ఫ్రాంచైజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Total runs scored by all the teams in #IPL2023 (First 5 matches)
1.#CSK– 952 RUNS
2.#RR– 948 RUNS
3.#KKR– 947 RUNS
4.#RCB– 899 RUNS
5.#LSG– 897 RUNS
6.#GT– 880 RUNS
7.#MI– 879 RUNS
8.#PBKS-845 RUNS
9.#SRH 803 RUNS
10.#DC– 770 RUNS pic.twitter.com/Xp8lLyqY9s— LORD GOATRAJ 🐐🐐 (@Lord_Shardulkar) April 20, 2023