సోమవారం రాత్రి, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ గోలలో పడిపోయారు. వర్షం పడటం వల్ల అర్ధరాత్రి వరకు జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ని ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి కప్ కొట్టేసింది. దీంతో సోషల్ మీడియాలో అంతా ధోనీ, చెన్నై టీమ్, జడేజా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అయితే సోమవారం సాయంత్రం ఐపీఎల్ క్రికెటర్ గాయపడిన విషయం మాత్రం పెద్దగా వెలుగులోకి రాలేదు. మ్యాచ్ హడావుడి పూర్తయిపోయేసరికి అందరూ.. యంగ్ క్రికెటర్ కి జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
అసలు విషయానికొచ్చేస్తే.. ఐపీఎల్ తో చాలామంది కుర్రాళ్లు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా రాజస్థాన్ రాయల్స్ కి ఆడి ఫేమ్ తెచ్చుకున్న రియాన్ పరాగ్. అసోంకి చెందిన ఈ కుర్రాడు… అంతకు ముందు బాగానే ఆడేవాడు. కానీ ఈ సీజన్ లో చాలా చెత్తగా బ్యాటింగ్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. రాజస్థాన్ లీగ్ దశలోనే నిష్క్రమించడంతో సొంతూరికి వెళ్లిపోయాడు. సోమవారం సాయంత్రం జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేసి ఇంటికి తిరిగెళ్లే క్రమంలో ఇతడికి యాక్సిడెంట్ అయిందనే న్యూస్ వచ్చింది. చిన్న దెబ్బలే తగిలాయని అంటున్నారు. మరి ఇది నిజమా అబ్బద్ధమా అనేది స్వయంగా పరాగ్ చెబితే గానీ తెలియదు.
Riyan Parag has got injured in an accident near the Navagraha Crematorium, Guwahati while coming back from gym.
Get well soon @ParagRiyan da! ❤️ pic.twitter.com/YnnN0orZJw
— Juman Sarma (@cool_rahulfan) May 29, 2023