ఐపీఎల్ అంటే వినోదాన్ని పంచడమే కాదు, ప్రజలకు సందేశాత్మక బోధనలు కూడా పంచగలదు. గతంలో పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం కోసం బెంగళూరు జట్టు గ్రీన్ జెర్సీ ధరిస్తే, గుజరాత్ టైటాన్స్ అలాంటి మరొక గొప్ప సందేశాన్ని ప్రజలకు పంచేందుకు లావెండర్ కలర్ జెరూసెయ్తో బరిలోకి దిగింది.
ఐపీఎల్ మ్యాచులు అంటే బ్యాటర్ల మెరుపులు, ఫీల్డర్ల విన్యాసాలు, ఆటగాళ్ల మధ్య వివాదాలే కాదు.. ప్రజలకు సందేశాత్మక బోధనలు పంపే ఓ టోర్నీ కూడాను. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) జట్టు గురుంచే. కోహ్లీ ఉన్నాడు కదా అందుకే ఆర్సీబీ మ్యాచులు ప్రత్యేకం అనుకుంటే పొరపాటు. పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం కోసం బెంగళూరు జట్టు ప్రతి సీజన్ లో ఒక మ్యాచులో గ్రీన్ డ్రెస్ వేసుకొని బరిలోకి దిగుతుంది. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కూడా ప్రజలకు అలాంటి ఓ గొప్ప సందేశాన్ని అందించడం కోసం నడుం బిగించింది. సోమవారం సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచులో ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగి అందరి మనసులు గెలుచుకుంది. గుజరాత్ ఆలా ప్రత్యేక జెర్సీ ధరించడం వెనకున్న కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సోమవారం సన్ రైజర్స్ తో మ్యాచ్ ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ లావెండర్ జెర్సీతో బరిలోకి దిగింది. క్యాన్సర్ కి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ఈ జెర్సీ ధరించారు. లావెండర్ కలర్ రిబ్బన్ అన్ని రకాల క్యాన్సర్లకు ప్రతీక కాబట్టి, ఈ కలర్ ధరించారు. గుజరాత్ ప్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై, గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఈ సంజ్ఞతో క్యాన్సర్ రోగులకు సంఘీభావం తెలియజేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.
“క్యాన్సర్ అనేది భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పోరాడుతున్న యుద్ధం. ఒక జట్టుగా మేము ఈ ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాము. లావెండర్ కలర్ రిబ్బన్ అన్ని రకాల క్యాన్సర్లకు ప్రతీక కాబట్టి.. క్యాన్సర్ రోగులకు, వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపెందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాం.. క్యాన్సర్ అనే యుద్ధంతో పోరాడుతున్న వారికి మేం తీసుకున్న ఈ నిర్ణయం ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాం..” అని పాండ్యా తెలిపాడు. గుజరాత్ ప్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Gujarat Titans stands united with our #TitansFAM in this battle against cancer.
Here’s what our players and coaching staff had to say ahead of this special occasion 💜#GTvSRH | #AavaDe | #TATAIPL 2023 pic.twitter.com/Ecof5FkALL
— Gujarat Titans (@gujarat_titans) May 15, 2023