భారత 3D ప్లేయర్ విజయశంకర్ విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో కేకేఆర్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. దీంతో అతడికి వరల్డ్ జట్టులో చోటు దక్కుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ ఈ ఏడాది అదే జోరు కొనసాగిస్తోంది. 8 మ్యాచుల్లో 6 విజయాలతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ నిర్ధేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ బ్యాటర్లు ఆడుతూ.. పాడుతూ ఛేదించారు. యువ ఓపెనర్ శుబ్‌మాన్ గిల్ 49 పరుగులతో రాణిస్తే.. భారత 3D ప్లేయర్ విజయశంకర్ హాఫ్ సెంచరీ(51)తో మెరిశాడు. ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న ఈ 3D ప్లేయర్ ఒక్కసారిగా వరల్డ్ కప్ రేసులోకి రావడం గమనార్హం.
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేకేఆర్ ఓపెనర్, ఆఫ్ఘాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ (81: 39 బంతుల్లో, 5 ఫోర్లు,7 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రస్సెల్(34: 19 బంతుల్లో, 2 ఫోర్లు,3 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ బ్యాటర్లు 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. మిడిల్ ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు తడబడినప్పటికీ భారత 3D ప్లేయర్ విజయశంకర్ హాఫ్ సెంచరీ(51)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న ఈ 3డీ ప్లేయర్ 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు.
Vijay Shankar is continuing his good form with the bat in IPL 2023.#KKRvGT #IPL2023 pic.twitter.com/dDh5aWS5lq
— CricTracker (@Cricketracker) April 29, 2023
ఇక ఈ సీజన్ అమాంతం నిలకడగా ఆడుతున్న విజయ్ శంకర్ ఒక్కసారిగా వరల్డ్ కప్ రేసులోకి వచ్చాడు. వన్డేలలో సూర్యకుమార్ యాదవ్ స్థాయిగా తగ్గట్టుగా రాణించకపోవడం, శ్రేయాస్ అయ్యర్ గాయాల బారిన పడటం ఈ 3D ప్లేయర్ కు కలిసొచ్చేలా ఉంది. అందులోను ఈ టోర్నీ స్వదేశంలోనే కనుక జట్టులో స్థానం దక్కతుందనే మాటలు వినపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడిన విజయశంకర్.. 199 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరో రెండు మ్యాచుల్లో రాణిస్తే జట్టులో స్థానం తప్పక దక్కవచ్చు అన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇదిలావుంటే.. ఈ విజయంతో గుజరాత్ టేబుల్ టాపర్ నిలిచి.. మరోసారి టైటిల్ వేటలో అందరికంటే ముందుంది. వరల్డ్ కప్ జట్టులో ఈ 3D ప్లేయర్ కి చోటు దక్కుతుందా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Vijay Shankar in IPL 2023:
27(21).
29(23).
63*(24).
10(12).
19(16).
51*(24).6 innings, 199 runs, 49.75 average, 165.83 strike rate, 2 fifties – Brilliant, Vijay Shankar! pic.twitter.com/idmaOZ615w
— CricketMAN2 (@ImTanujSingh) April 29, 2023
Gujarat Titans in IPL 2023:
– Beat Delhi in Delhi.
– Beat Punjab in Punjab.
– Beat Lucknow in Lucknow.
– Beat Kolkata in Kolkata.4 wins in 4 away games – Hardik army is on a roll. pic.twitter.com/AIN6toEWmy
— Johns. (@CricCrazyJohns) April 29, 2023