SRH vs PBKS Prediction: సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్ ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందంటే..?
ఐపీఎల్ 2023లో అన్ని మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహా అన్ని జట్లు గెలుపు రుచి చూశాయి. వరుస ఓటముల భారాన్ని దింపుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 నుంచి మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తుందా? లేదా? పంజాబ్ బలం ఎలా ఉంది? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్..
సీజన్ ఆరంభానికి ముందు జట్టులోని ఆటగాళ్ల లిస్ట్ చూసుకుని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇది కదా టీమ్ అంటే.. ఈసారి కప్పు మనదే అనే రేంజ్‌లో నమ్మకం పెట్టుకున్నారు. కానీ.. రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత.. వీళ్లేంటి ఇలా ఆడుతున్నారంటూ షాక్ అవుతున్నారు. అయితే.. ఫ్యాన్స్ కోపాన్ని తగ్గించి, ఈ సీజన్‌లో తొలి విజయం సాధించాలని మార్కరమ్ సేన గట్టి పట్టుదలతో ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ నుంచి మంచి స్టార్ట్ వస్తేనే మిగతా బ్యాటర్లపై భారం తగ్గుతుంది. భారీ అంచనాల మధ్య ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రూ.13.25 కోట్ల ఆటగాడు హ్యారీ బ్రూక్ తన ధరకు న్యాయం చేయాల్సి ఉంది. కెప్టెన్ మార్కరమ్‌కు ఇది రెండో మ్యాచ్. వాషింగ్టస్ సుందర్ సైతం సరిగా రాణించడం లేదు. మొత్తంగా సన్‌రైజర్స్ బ్యాటింగ్ పేపర్‌పై బలంగా ఉన్నా.. గ్రౌండ్‌లోనే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. బౌలింగ్ విషయంలో పర్వాలేదు. అయితే.. ఈ మ్యాచ్‌లో హోం గ్రౌండ్‌లో జరగనుండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం.
పంజాబ్ కింగ్స్..
ఐపీఎల్ 2023 ఆరంభానికి ముందు ఏ మాత్రం అంచనాలు లేని టీమ్ ఏదైన ఉందంటే అంది పంజాబ్ కింగ్స్. జట్టులో స్టార్లు లేరు అయినా కూడా ఆడిన తొలి మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు విజయం సాధించి.. అందరి అంచనాలను తలకిందులు చేసింది. దీంతో హ్యాట్రిక్ విజయం కోసం ఆ జట్టు బరిలోకి దిగుతుంది. కెప్టెన్ ధావన్ మంచి ఫామ్‌లో ఉండటం పంజాబ్‌కు బలం. మిడిల్దార్‌లో అంత పస లేదు. ఇక బౌలింగ్‌లో సామ్ కరన్, అర్షదీప్ సింగ్, ఎల్లీస్, రజా, రాహుల్ చాహర్ పంజాబ్ బలం. అయితే బ్యాటింగ్‌లో గబ్బర్ పేయిల్ అయితే.. మిడిల్డార్ ఎంత వరకు రాణిస్తుందో చూడాలి. దానిపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే.. ఆ జట్టు యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ గత మ్యాచ్‌లో ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ను అప్పుడే మర్చిపోకూడదు. అతను మళ్లీ అలాంటి ఇన్నింగ్స్ ఆడితే.. సన్‌రైజర్స్‌కు కష్టాలు తప్పవు.
తుది జట్లు (అంచనా)
SRH: అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, హ్యారీ బ్రూక్, క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువీ, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
PBKS: శిఖర్ ధావన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సా, జితేష్ శర్మ, సికందర్ రజా, షారుఖ్ ఖాన్, సామ్ కరన్, హర్‌ప్రీత్, రాహుల్ చాహర్, నాథన్ ఎల్లీస్, అర్షదీప్ సింగ్.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశం ఉంది.
#TATAIPL2023 Match No. 14#SRH VS #PBKS
🗓 9th April, 2023 | 🕞 7:30 PM#SRHvsPBKS #TATAIPL2023 #IPL #PBKSvSRH pic.twitter.com/6ewbmuidnt
— **Roshu,,RN..❣️🚩 (@RnSrkrider) April 9, 2023