SRH vs MI Prediction: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు ముంబై ఇండియన్స్ దక్కన్ గడ్డపై అడుగుపెట్టింది. ఉప్పల్ వేదికగా ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందంటే..?
ఐపీఎల్ 2023 సీజన్ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సాగుతోంది. మ్యాచ్‌లు చివరి బాల్ వరకు జరుగుతూ.. ఉత్కంఠభరితంగా సాగుతూ.. క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో మరో మెగా ఫైట్‌కు రంగం సిద్ధమైంది. మన హైదరాబాద్ గడ్డపై ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఉన్నాయి. మరి ముచ్చటగా మూడో విజయం ఎవర్ని వరిస్తుందంటే..?
ముంబై ఇండియన్స్..
ముంబై జట్టుకు కొండంత బలం వచ్చేసింది. ఎందుకంటే మిస్టర్ 360, వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి వచ్చేశాడు. దీంతో ముంబై బ్యాటింగ్ మరింత బలపడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ ఇలా అంతా ఫామ్‌లో ఉండటంతో ముంబై బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బ్యాటింగ్‌లో దుర్బేధ్యంగా కనిపిస్తోన్న ముంబై. బౌలింగ్‌లోనే కాస్త వీక్‌గా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్..
హ్యారీ బ్రూక్ సెంచరీతో దుమ్ములేపడంతో సన్‌రైజర్స్ జట్టు ఇప్పుడు అసలైన రైజింగ టీమ్‌గా కనిపిస్తోంది. కెప్టెన్ మార్కరమ్, అభిషేక్ శర్మ సైతం భీకర ఫామ్‌లో ఉన్నారు. వీరికి తోడు మయాంక్ అగర్వాల్ సైతం ఫామ్‌లోకి వస్తే.. సన్‌రైజర్స్ బ్యాటింగ్‌ను నిలువరించడం కష్టమే. ఇక బౌలింగ్‌లోనూ హైదరాబాద్ పటిష్టంగా ఉంది. ఉమ్రాన్ మాలిక్, భువీ, జాన్సెన్, వాషింగ్టన్, నటరాజన్‌తో బౌలింగ్ ఎటాక్ భీకరంగా ఉన్నా.. ఎక్కువగా పరుగులు ఇవ్వడమే మైనస్‌గా మారింది. కాస్త పొదుపుగా బౌలింగ్ వేస్తే.. సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో మ్యాచ్ జరగడం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. సొంత మైదానంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.
తుది జట్ల అంచనా..
SRH: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువీ, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్.
MI: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహల్, అర్జున్ టెండూల్కర్, జోఫ్రా ఆర్చర్, షోకిన్, పియూష్ చావ్లా, మెరిడెత్.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశం కనిపిస్తోంది. సొంత గ్రౌండ్‌లో ఆడుతుండటం ఎస్‌ఆర్‌హెచ్‌కు అదనపు బలం.