ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్ దశకు చేరుకుంటోంది. అయితే ఈ సీజన్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ మారలేదు. ఎన్ని మార్పుచేర్పులు చేసినా ఏదీ కలసిరాలేదు. ఎస్ఆర్హెచ్ చెత్త ఆటకు ఆరు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 34 రన్స్ తేడాతో ఓడిపోయింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 రన్స్ చేసింది. శుబ్‌మన్ గిల్ (101), సాయి సుదర్శన్ (47) అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా గిల్ తన క్లాస్‌ను మరోసారి చూపించాడు. ఆ తర్వాత ఛేజింక్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా సాగలేదు. ఓపెనర్లు అన్మోల్ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, సారథి ఎయిడెన్ మార్క్రమ్ సహా అందరూ ఫెయిలయ్యారు. ఒక్క హెన్రిచ్ క్లాసెన్ (64) మాత్రమే రాణించాడు. కానీ అతడికి మిగతా వారి నుంచి మద్దతు కరువైంది. ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గత మూడు సీజన్లుగా ఘోరంగా విఫలవమవుతోంది.
ఐపీఎల్-2021లో 14 మ్యాచుల్లో కేవలం మూడు మ్యాచుల్లో గెలిచి, పదకొండింట్లో ఓడిన ఎస్ఆర్హెచ్.. ఆ టోర్నీ పాయింట్ల టేబుల్లో ఆఖరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్-2022లో కూడా రైజర్స్ మరోసారి అభిమానులను నిరాశపర్చింది. గతేడాది లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఎనిమిది మ్యాచుల్లో ఓడి.. ఆరింట్లో విజయం సాధించింది. మరోమారు ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాకుండానే టోర్నీలో రన్‌ను ముగించింది. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఐపీఎల్-2023లో ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్.. నాలుగింట గెలిచి, ఎనిమిది మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఈసారి కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్రమ్కు ఛాన్స్ ఇచ్చినా జట్టు రాత మాత్రం మారలేదు. ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్‌కు ఎస్ఆర్హెచ్ అర్హత సాధించలేకపోయింది. అంటే టోర్నీలో మన జట్టు కథ ముగిసినట్లే.
ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ చెత్త ఆటకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఉన్న ఆరు కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. టీమ్ బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకు మినీ వేలంలో రూ.13 కోట్లు పెట్టి మరీ హ్యారీ బ్రూక్‌ను దక్కించుకుంది ఎస్ఆర్హెచ్. అయితే ఒక మ్యాచ్‌లో సెంచరీ బాదిన బ్రూక్.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. మొత్తం 9 మ్యాచ్‌ల్లో అతడు చేసింది కేవలం 163 రన్స్ మాత్రమే. ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రూక్ ఇలా అట్టర్ ఫ్లాప్ అవడంతో జట్టు బ్యాటింగ్‌లో తేలిపోయింది. మరో కారణం సరైన ఫైనల్ ఎలెవన్‌ను ఎంచుకోవడంలో సారథి ఎయిడెన్ మార్క్రమ్ ఫెయిల్యూర్. అందుబాటులో మంచి బ్యాటర్లు, పేసర్లు ఉన్నా ఫైనల్ ఎలెవన్‌ను సెలెక్ట్ చేసుకోవడంలో సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హెన్రిచ్ క్లాసెన్, ఫిలిప్స్ లాంటి ప్రతిభావంతులైన స్టార్ల సేవలను పూర్తిగా వాడుకోవడంలో కెప్టెన్ మార్క్రమ్, కోచింగ్ సిబ్బంది ఫెయిల్యూర్ ఎంతగానో ఉంది.
ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లకు మరిన్ని ఛాన్సులు ఇచ్చి ప్రోత్సహించలేదు ఎస్ఆర్హెచ్ కోచింగ్ స్టాఫ్. ఫెయిలైతే పక్కనబెట్టేయడం, వారి స్థానంలో మరొకర్ని తీసుకోవడం వల్ల ఆటగాళ్ల నైతిక స్థైర్యం దెబ్బతింది. జట్టులో చోటుకు ఢోకా లేదనే గ్యారెంటీ ఇస్తే ప్లేయర్లు బాగా ఆడేందుకు ఛాన్స ఉండేది. మిగతా జట్లలోలాగా లోకల్ ప్లేయర్ల బలం లేకపోవడమూ ఎస్ఆర్హెచ్కు మైనస్‌గా మారింది. మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, నటరాజన్ లాంటి మంచి ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా వాళ్లు ఫ్లాప్ అవ్వడం జట్టుకు శాపంగా మారింది. అదే టైమ్‌లో టైటిల్ గెలవాలన్న కసి, తపన ప్లేయర్లలో అస్సలు కనిపించలేదు. ఆటగాళ్లను ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ మార్క్రమ్ సారథిగానూ బ్యాటర్‌గానూ పూర్తిగా ఫెయిలయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ వరుస ఓటములను మూటగట్టుకొని టోర్నీ నుంచి ఒట్టిచేతులతో నిష్క్రమించాల్సిన దుస్థితికి చేరుకుంది. ఈ సీజన్లో కూడా జట్టు ఫ్యాన్స్, ఓనర్ కావ్యా పాపకు మరోసారి కన్నీళ్లే మిగిలాయి.