టీమిండియా యంగ్ ఓపెనర్‌పై లెజెండరీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. ఇదేం చెత్త ఆటంటూ ఫైర్ అయ్యాడు. ఇలాంటి షాట్ సెలక్షన్ ఏంటని సీరియస్ అయ్యాడు.
ఏ రంగమైనా కొత్త రక్తం వస్తూ ఉండాలి. అనుభవజ్ఞుల అండతో వారు రాటుదేలి ఆ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. క్రికెట్ కూడా అంతే. సీనియర్ క్రికెటర్లతో జట్టు ఎంత బలంగా ఉన్నా యువకులు కూడా టీమ్‌లోకి రావాలి. సీనియర్ల దగ్గర మరిన్ని విషయాలు నేర్చుకుని క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాలి. అందుకే ఏ టీమ్ అయినా ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తుంది. పృథ్వీ షాను కూడా టీమిండియా మేనేజ్మెంట్ అలాగే ప్రోత్సహించింది. అందుకు తగ్గట్లే జట్టులోకి వచ్చిన కొత్తలో తానేంటో నిరూపించుకున్నాడు షా. అయితే ఆటలో నిలకడలేమితో జట్టుకు దూరమయ్యాడు. 2018లో టీమిండియా తరఫున షా ఎంట్రీ ఇచ్చినప్పుడు.. సెహ్వాగ్, లారా, సచిల్ లాంటి స్టార్ బ్యాటర్ల సరసన చేరే సత్తా ఈ యంగ్‌స్టర్‌కు ఉందని రవిశాస్త్రి లాంటి లెజెండ్ వ్యాఖ్యానించాడు.
రవిశాస్త్రి వ్యాఖ్యలు మాత్రం నిజం కాలేదు. జాతీయ జట్టుకు దూరమయ్యాడు పృథ్వీ షా. ప్రస్తుతం దేశవాళీలో బాగానే రాణిస్తున్నా భారత జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. అదే సమయంలో షా సారథ్యంలో అండర్-19 ప్రపంచ కప్ ఆడిన మరో యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మాత్రం టీమిండియాలో కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలతో చెలరేగుతూ.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. అదే విధంగా ఐపీఎల్‌లోనూ సత్తా చాటుతున్నాడు. అరంగేట్ర సీజన్లోనే కప్‌ను ఒడిసిపట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు గిల్. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనూ చెన్నైతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
ఒకవైపు శుబ్‌మన్ గిల్ కెరీర్లో రాకెట్లా దూసుకుపోతుంటే.. మరోవైపు పృథ్వీ షా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో తొలి మ్యాచ్‌లో 12 రన్స్‌కే పెవిలియన్‌కు చేరిన ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్.. రెండో మ్యాచులోనూ ఫెయిలయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో 7 పరుగులే చేసి ఔటయ్యాడు. చెత్త షాట్ సెలక్షన్‌తో వరుసగా విఫలమవుతున్న షాపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. తన తోటి ప్లేయర్లు గిల్, రుతురాజ్ గైక్వాడ్ పరుగుల వరద పారిస్తుంటే.. షా మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాడని చెప్పాడు. చెత్త షాట్లతో వికెట్లు సమర్పించుకుంటున్నాడని.. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదని చురకలు అంటించాడు.
#IPL2023
Comparing Shaw to Shubman Gill, his one-time partner in U-19 cricket, and Ruturaj Gaikwad, Sehwag unleashed a tirade on how Shaw’s has been overtaken by plenty of his peers.https://t.co/lhF8HZ9sw8— Express Sports (@IExpressSports) April 5, 2023