ఐపీఎల్ పదహారో సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్న రెండు జట్లూ హేమాహేమీలనే చెప్పాలి. అందులో ఒక టీమ్ అయిన గుజరాత్ టైటాన్స్.. ఫస్ట్ మ్యాచ్ నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఎదురొచ్చిన ప్రతి టీమ్‌ను ఓడిస్తూ టోర్నీలో ముందుకు సాగింది. గెలుపు పరంపరను కొనసాగిస్తూ లీగ్ స్టేజీ ముగిసే టైమ్‌కు పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేసులో నిలిచింది. అయితే ప్లేఆఫ్స్‌లోనే గుజరాత్‌కు అసలు టెన్షన్ మొదలైంది. క్వాలిఫయర్స్-1లో సీఎస్కే చేతిలో ఓటమితో ఆ జట్టు కుంగిపోయింది. అయితే ఫైనల్‌కు వెళ్లాలంటే తప్పక నెగ్గాల్సిన క్వాలిఫయర్-2లో మాత్రం గుజరాత్ అద్భుతం చేసింది. ముంబై ఇండియన్స్‌పై విక్టరీతో ఆ టీమ్ ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఒంటిచేత్తో గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
శుబ్‌మన్ గిల్ క్లాస్ హిట్టింగ్‌కు ప్రత్యర్థులు దాసోహమన్నారు. మరోవైపు చెన్నై కథ మాత్రం వేరేలా ఉంది. సీజన్ ఫస్టాఫ్‌లో వరుస ఓటములతో డీలాపడింది చెన్నై. ఒక దశలో ట్రోఫీ సంగతి పక్కనబెడితే కనీసం ప్లేఆఫ్స్‌కు సీఎస్కే చేరుకున్నా గ్రేట్ అనేలా కనిపించింది. అయితే కెప్టెన్ ఎంఎస్ ధోని తన అనుభవాన్ని రంగరించి టీమ్‌ను విజయాల బాట పట్టించాడు. అవసరం, సందర్భాన్ని బట్టి అందుబాటులో ఉన్న బ్యాటింగ్, బౌలింగ్ వనరులను సరిగ్గా వాడుకొని టీమ్‌కు ఎదురు లేకుండా చేశాడు. దీంతో చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఇక పటిష్టమైన గుజరాత్‌ను క్వాలిఫయర్స్‌లో మట్టికరిపించి.. తుదిపోరులోనూ అదే జట్టును ఢీకొనేందుకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. మ్యాచ్ జరగకుండానే విన్నర్ ఎవరో తేలిపోయిందని నెటిజన్స్ అంటున్నారు. గుజరాత్ టైటాన్సే ఈ సారి కప్ గెలవబోతోందని చెబుతున్నారు. దీనికి కారణం.. షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి ఐపీఎల్ ఫైనల్ ఫైట్ జరగాల్సింది. అయితే వర్షం వల్ల మ్యాచ్‌ను రిజర్వ్ డేకు మార్చారు. మ్యాచ్‌కు ముందు నరేంద్ర మోడీ స్టేడియంలో స్క్రీన్ టెస్టులో భాగంగా చెన్నై రన్నరప్ అని ప్లే చేశారు. ఆ ఫొటోలే ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో అందరూ మ్యాచ్ ఫిక్స్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి స్టేడియం సిబ్బంది స్క్రీన్ టెస్టులో భాగంగా చేసిన పొరపాటుగా దీన్ని చెప్పొచ్చు. అయితే చెన్నై రన్నరప్ అనే ఫొటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
When you accidentally upload the climax of the movie instead of the trailer pic.twitter.com/raqMEXDoPR
— Sagar (@sagarcasm) May 28, 2023