RR vs LSG Prediction: ఐదేసి మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో రాజస్థాన్, మూడు విజయాలతో లక్నో టేబుల్ టాపర్స్‌గా ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య పోరుపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి వీరిలో ఎవరు గెలుస్తారంటే?
ఐపీఎల్ 2023లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు ఒకటి రెండూ మినహా ఏకపక్ష మ్యాచ్‌లు జరగలేదు. మ్యాచ్ చివరి బాల్, చివరి ఓవర్ వరకు మ్యాచ్‌లు వెళ్తూ అసలు సిసలైన క్రికెట్ మజాను పంచుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ తమ సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టును విజయం వరించనుందో ఇప్పుడు చూద్దాం..
రాజస్థాన్ రాయల్స్..
రాయల్స్ ప్రధాన బలం ఓపెనింగ్ జోడీ. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ రూపంలో మంచి ఓపెనర్లు ఉన్నారు. పైగా వీరిద్దరూ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా ఫామ్‌లోకి రావడంతో రాయల్స్ బ్యాటింగ్ లైనప్ బలంగా మారింది. ఇన్ని రోజులు సంజు ఫామ్‌లో లేకుండానే మంచి విజయాలు సాధించిన రాజస్థాన్ ఇప్పుడు అతను కూడా ఫామ్‌లోకి రావడంతో భీకరంగా ఉంది. అలాగే హెట్‌మేయర్ సైతం మంచి టచ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌తో బౌలింగ్‌లోనూ రాయల్స్ గట్టిగానే ఉంది. అశ్విన్, చాహల్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, ఆడమ్ జంపాతో బౌలింగ్ ఎటాక్ పటిష్టంగా ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్..
కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రావడంతో లక్నో బ్యాటింగ్ మరింత పటిష్టమైంది. ఈ మ్యాచ్‌తో క్వింటన్ డికాక్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. రాహుల్-డికాక్ మంచి ఓపెనింగ్ జోడీ. వీరిద్దరి ట్రాక్ రికార్డు కూడా బాగుంది. ఇక మిడిల్ ఓవర్స్‌లో మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్ బాగా ఆడుతున్నారు. కైల్ మేయర్స్‌ను కూడా మిడిల్డార్‌లో ఆడించే అవకాశం ఉంది. అయితే.. డికాక్ లేదా మేయర్స్ ఇద్దరిలో ఒకరు మాత్రమే బరిలోకి దిగుతారు. ఇక బౌలింగ్‌లోనూ లక్నో పటిష్టంగా ఉంది. మార్క్ వుడ్ రూపంలో లక్నోకు బెస్ట్ బౌలర్ దొరికాడు. రవి బిష్ణోయ్ ప్రభావం చూపిస్తున్నాడు.
తుది జట్ల అంచనా..
RR: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మేయర్, ధృవ్ జురెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, చాహల్.
LSG: కేఎల్ రాహుల్, డికాక్/మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, ఆయూష్ బదోని, ఆవేస్ ఖాన్, యుద్ధవీర్‌సింగ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించే అవకాశం ఉంది. సొంత మైదానం జైపూర్‌లో ఆడటం కూడా ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
M̶e̶n̶t̶a̶l̶l̶y̶ We’re in Jaipur! 💗#RRvLSG – Home debut for some and a homecoming for all. Don’t miss! 👇🗞️💗
— Rajasthan Royals (@rajasthanroyals) April 19, 2023