RR vs GT Prediction: ఆదివారం డబుల్ హెడ్డర్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో గుజరాత్‌తో రాజస్థాన్ తలపడుతోంది. ఇప్పటికే ఈ రెండు జట్లు 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఉన్నాయి. మరి నాలుగో విజయం ఎవరి సొంతం అవుతుందో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2023లో మరో బిగ్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో అత్యంత బలమైన జట్లుగా పేరు తెచ్చుకున్న రాజస్థాన్ రాయల్స్-గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడుతున్నాయి. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మెగా మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన దాదాపు అన్ని మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులు బోలెడంత వినోదాన్ని అందించాయి. దాదాపు ప్రతి మ్యాచ్ కూడా చివరి బాల్, చివరి ఓవర్ వరకు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌పై సైతం క్రికెట్ ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ పోరులో ఏ జట్టు విజయావకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
రాజస్థాన్ రాయల్స్..
రాజస్థాన్‌కు బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. యశస్వి జైస్వాల్-జోస్ బట్లర్ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటం రాజస్థాన్‌కు కలిసొచ్చే అంశం. కెప్టెన్ సంజు శాంసన్ ప్రస్తుతం సరైన ఫామ్‌లో లేకపోయినా.. అతను కూడా ఫామ్‌లోకి వస్తే.. ఆర్‌ఆర్ బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారుతుంది. మిడిల్డార్‌లో దేవదత్ పడిక్కల్, హేట్‌మేయర్, ధృవ్ జురెల్‌తో బాగానే ఉంది. ఇక బౌలింగ్‌లో రాజస్థాన్ పటిష్టంగా ఉంది. అశ్విన్, చాహల్ లాంటి మేటి స్పిన్నర్లు రాజస్థాన్ సొంతం. హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మతో పేస్ ఎటాక్ సైతం బలంగానే ఉంది.
గుజరాత్ టైటాన్స్..
గిల్-సాహా రూపంలో గుజరాత్‌కు మంచి ఓపెనింగ్ జోడీ ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫేలవ ఫామ్‌లో ఉండటం గుజరాత్‌ను కలవరపెడుతున్న విషయం. మిల్లర్, తెవాటియా ఫామ్‌లో ఉండటంతో పాండ్యా ఫామ్ లేమి పెద్దగా కనిపించడం లేదు. బ్యాటింగ్ కంటే బౌలింగే గుజరాత్ ప్రధాన బలం. రషీద్ ఖాన్, షమీ, లిటిల్, జోసెఫ్‌తో బౌలింగ్ పటిష్టంగా ఉంది.
తుది జట్ల అంచనా..
RR: వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, షమీ, లిటిల్.
GT: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, పడిక్కల్, హెట్‌మేయర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, చాహల్.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించే అవకాశం ఉంది.
𝘍𝘪𝘳𝘦 𝘣𝘶𝘳𝘯𝘪𝘯𝘨 𝘣𝘳𝘪𝘨𝘩𝘵, under the lights in Ahmedabad tonight. 🔥 pic.twitter.com/N6rLYb4gKS
— Rajasthan Royals (@rajasthanroyals) April 16, 2023