ఐపీఎల్ 2023లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగానే సాగుతోంది. ఇప్పటికే 3 మ్యాచ్ లు ముగిశాయి. ఆదివారం రెండో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ జట్టు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో అంచనా వేద్దాం.
ధనాధన్ లీగ్ లో హై వోల్టేజ్ మ్యాచ్ కు వేళైంది. రెండేళ్ల తర్వాత హోమ్ గ్రౌండ్ లో తమ జట్టు విజృంభణను చూసేందుకు బెంగళూరు అభిమానులు అంతా చిన్న స్వామి స్టేడియానికి పోటెత్తారు. ఐపీఎల్ 2023లో తొలి మ్యాచ్ అనే క్రేజ్ ఉండనే ఉంది. పైగా రెండేళ్ల తర్వాత హోంగ్రౌండ్ లో తమ జట్టు ఆడనుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రత్యర్థి ముంబయి ఇండియన్స కావడం మరో విశేషం. ఈ నేపథ్యంలోనే ఈరోజు బెంగళూరు- ముంబయి జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఎవరు విజయం సాధిస్తారు? అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి.. ఈ రెండు జట్లలో విజయం సాధించేది ఎవరో అంచనా వేద్దాం.
ఆదివారం రాత్రి 7 గంటలకు చిన్న స్వామి స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్– బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల బలాబలాలను బట్టి.. ఈ మ్యాచ్ లో విజయం ఎవరు సాధిస్తారు అనే ఒక అంచనా వేద్దాం. ఈ మ్యాచ్ ని హైవోల్టేజ్ మ్యాచ్ అని ఊరికే అనలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ కచ్చితంగా పోటాపోటీగానే ఉంటుంది. ఎందుకంటే ఇరు జట్లు అన్ని విభాగాల్లో అంతే బలంగా ఉన్నాయి కాబట్టి. బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఫాఫ్ ఆర్సీబీలో డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్, డీకే అంటూ హేమాహేమీలో ఉన్నారు. అటు ముంబైలో చూసుకుంటే.. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అంటూ వాళ్లు కూడా ఏమాత్రం తగ్గేలా లేరు.
ఇంక బౌలింగ్ విషయానికి వస్తే.. ఆర్సీబీలో మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ వంటి స్టార్లు ఉండనే ఉన్నారు. ముంబయిలో అయితే జోఫ్రా ఆర్చర్, జేసన్ బెహ్రెండాఫ్ర్ లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఈ నలుగురికే ఎక్కువ వికెట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఆర్సీబీనే గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ గత రికార్డులను ఉదాహరణగా చూపిస్తున్నారు. అంటే 2013 నుంచి 2022 వరకు ఐపీఎల్ తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ గెలిచింది లేదు. ఆ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయ్యిద్దేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హోం గ్రౌండ్ కావడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే కాస్త ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది వాదన.
డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్ వెల్, షహబాజ్ అహ్మద్, మైకేల్ బ్రేస్ వెల్, దినేశ్ కార్తీక్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, రీస్ టోప్లే
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరోన్ గ్రీన్, రమన్ దీప్ సింగ్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ, జేసన్ బెహ్రెన్ డార్ఫ్
ముంబయి సెంటిమెంట్లు, హోంగ్రౌండ్ అంచనాల దృష్ట్యా ఈ మ్యాచ్ లో RCBనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
(గమనిక: ఐపీఎల్ లో చివరి బంతితో మ్యాచ్ ఫలితం మారిపోవచ్చు. కాబట్టి పైన చెప్పిన అంచనాలు కొన్నిసార్లు తప్పొచ్చు. వ్యూయర్స్ గమనించగలరు)