RCB vs LSG Prediction: బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం ఆర్సీబీతో లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడనుంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు ఏదో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2023లో మ్యాచ్‌లు అంచనాలుకు మించి థ్రిల్లింగ్‌గా సాగుతున్నాయి. ఆదివారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే.. ఎవరూ ఊహించని విధంగా ముగిసింది. మ్యాచ్ చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సులు కొట్టి రింకూ సింగ్ కేకేఆర్‌ను గెలిపించాడు. దీంతో ఐపీఎల్‌కు హైప్ మరింత పెరిగింది. సోమవారం ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచ్‌పై కూడా క్రికెట్ అభిమానులు భారీ ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారనే దానికిపై క్రికెట్ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొని ఉంది. అయితే.. ఎవరి బలం, బలహీనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు..
ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ తొలి మ్యాచ్‌లో గెలిచి, రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో ముంబైపై సాధించిన విజయం చూస్తే.. ఈ సారి ఆర్సీబీని ఆపడం కష్టమే అనే భావన కలిగింది. కానీ.. రెండో మ్యాచ్‌కే ఆ నమ్మకం అంతా గంగపాలైంది. ఆర్సీబీ బ్యాటింగ్ మొత్తం ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్‌పైనే ఆధారపడి ఉండటం ఆర్సీబీకి పెద్ద మైనస్. వాళ్లిద్దరూ ఓపెనర్లుగా ఉండటం కూడా వారి బలం. అయితే.. వాళ్లిద్దరూ విఫలమైన వేళ ఇతర బ్యాటర్లు ఆదుకోవడం లేదు. ఇక బౌలింగ్ విషయంలో ఆరంభంలో ప్రత్యర్థిని కట్టడి చేసినా.. చివర్లో ధారళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. బౌలింగ్ కాస్త మెరుగైతే.. ఆర్సీబీకి తిరుగుండదు. ఇక మ్యాచ్ కూడా ఆర్సీబీ హోం గ్రౌండ్‌లో కావడం కలిసొచ్చే అంశం.
లక్నో సూపర్ జెయింట్స్..
కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించింది. ఈ జట్టుకు కెప్టెన్ భారంగా మారాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ రాహుల్ విఫలం అవ్వడం ఆ జట్టును టెన్షన్ పెడుతుంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ బరిలో దిగే అవకాశం ఉంది. అలాగే లక్నో మిడిల్డార్ చాలా బలంగా ఉంది. కానీ.. బౌలింగ్ ఎటాక్ వీక్‌గా కనిపిస్తోంది. రవి బిష్ణోయ్, మార్క్ వుడ్ మినహా పెద్దగా మ్యాచ్ విన్నర్లు లేరు. దీంతో టాస్ అటూ ఇటూ అయితే.. లక్నో బౌలింగ్ బలంపై మ్యాచ్ గెలవడం కష్టమే. అయితే.. బ్యాటింగ్ లైనప్ మాత్రం కొండంత స్కోర్‌ను సైతం పిండి చేసేలా ఉంది.
తుది జట్ల అంచనా..
RCB: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, అనుజ్ రావత్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మాద్, దినేష్ కార్తీక్, మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, కరణ్ శర్మ, సిరాజ్.
LSG: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, యాష్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించే అవకాశం ఉంది.