RCB vs KKR Prediction: పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. 7వ స్థానంలో ఉన్న కేకేఆర్‌తో తలపడుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే..??
ఐపీఎల్ 2023 మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. మంగళవారంతో సగం సీజన్ ముగిసింది. బుధవారం నుంచి ఐపీఎల్ రెండో దశ మొదలు కానుంది. ఇక్కడి నుంచి ప్రతి టీమ్ మిగిలిన జట్లతో రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడనుంది. సగం సీజన్ ముగిసిన తర్వాత.. కేకేఆర్ కంటే ఆర్సీబీ కాస్త బెటర్ పొజిషన్‌లో ఉంది. మరి ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ఆర్సీబీ తన ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తోంటే.. కేకేఆర్ మాత్రం తిరిగి పోటీలోకి రావాలని ప్రయత్నిస్తోంది. మరి ఈ పోరులో విజయం ఎవర్ని వరిస్తుందంటే..?
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు..
ఆర్సీబీ ప్రస్తుతం మంచి విజయాలు నమోదు చేస్తున్నా.. ఎక్కువగా కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌పైనే బ్యాటింగ్‌లో ఆధారపడుతోంది. అలాగే బౌలింగ్‌లో ఒక్క సిరాజ్ తప్పితే ఎవరూ కూడా ప్రభావం చూపలేకపోతున్నారు. ఆర్సీబీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇది ఆర్సీబీకి పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా చివరి ఓవర్లలో లోయర్ ఆర్డర్‌బ్యాటర్లు పరుగులు చేయడం లేదు. ఇలా ఎన్ని లోపాలు ఉన్నా.. కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ చెలరేగితే.. ఆర్సీబీ విజయం ఖాయంగా ఉంది పరిస్థితి.
కోల్‌కత్తా నైట్ రైడర్స్..
ఈ సీజన్‌లో కేకేఆర్ కేవలం సంచలన విజయాలకు కేరాఫ్ ఆడ్రస్‌గా నిలుస్తోంది. నిలకడలేమి ఆటతీరుతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఓపెనర్లు సెట్ కాకపోవడం, మిడిల్డార్‌లో స్టార్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ ఫామ్‌లో లేకపోవడం కేకేఆర్‌ను బాగా ఇబ్బంది పెడుతుంది. ఇక బౌలింగ్‌లోనూ సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి పెద్దగా ప్రభావం చూపడం లేదు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కేకేఆర్ సమతుల్యంగా కనిపిస్తున్నా.. నిలకడలేమి కేకేఆర్‌ను ఇబ్బంది పెడుతుంది.
తుది జట్ల అంచనా..
RCB: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మహిపాల్ లోమ్‌రోర్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, సూయష్ ప్రభు దేశాయ్, డేవిడ్ విల్లే, హసరంగా, హర్షల్ పటేల్, సిరాజ్. (ఇంపాక్ట్ ప్లేయర్-విజయ్ కుమార్)
KKR: జగదీశణ్, జెసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, డేవిడ్, శార్ధుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. (ఇంపాక్ట్ ప్లేయర్- సూయాష్ శర్మ)
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశం కనిపిస్తోంది. అలాగే హోం గ్రౌండ్‌లో ఆడటం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం.
Reverse fixture 🆚 KKR tonight! 💪
Get ready for a show because this one’s going to be straight fire! 🔥#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvKKR pic.twitter.com/gsbTnb1KmB
— Royal Challengers Bangalore (@RCBTweets) April 26, 2023