RCB vs KKR Prediction: ఐపీఎల్ 2023లో ఆర్సీబీ-కేకేఆర్ జట్లు బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధించే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ వినోదం అందిస్తున్న ఐపీఎల్‌లో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు రెండో మ్యాచ్ కోసం రెడీ అయింది. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో వారి హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం రాత్రి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఐదు సార్లు ట్రోఫీ గెలిచిన పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ అదే ఉత్సహంలో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. ఇక తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన కోల్‌కత్తా సొంత మైదానంలో సత్తా చాటి ఈ సీజన్‌లో బోణి చేయాలని భావిస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఈ జట్టుకు విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
ఆర్బీబీ..
విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండటంతో ఆర్సీబీ ఒక డిఫెరెంట్ టీమ్‌గా కనిపిస్తోంది. గతేడాది కోహ్లీ ఫామ్‌లో లేకుండానే ప్లేఆఫ్స్ వరకు చేరిన ఆర్సీబీ.. ఇప్పుడు కోహ్లీ ఆడుతున్న తీరు చూస్తుంటే.. ఈ సాలా కప్ నమ్‌దే స్లోగన్‌ను నిజం చేసేలా కనిపిస్తోంది. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సైతం 70కి పైగా పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్య అందించారు. కోహ్లీ ఆడితే.. ఆర్సీబీకి ఎంత సులువైన విజయాలు దక్కుతాయో చెప్పేందుకు తొలి మ్యాచ్ మంచి ఉదాహరణ. అదే టెంపోను కొనసాగిస్తే.. ఆర్సీబీని అడ్డుకోవడం కష్టమే. ఒక బౌలింగ్ విషయంలోనూ ఆర్సీబీ పటిష్టంగా కనిపిస్తోంది. సిరాజ్, కరణ్ శర్మ తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలాగే హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ సైతం మెరుగైన ప్రదర్శన కనబరిస్తే.. ఆర్సీబీకి రెండో విజయం గ్యారంటీ.
కేకేఆర్..
యువ క్రికెటర్ నితిష్ రాణా కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న కోల్‌కత్తాకు రహమనుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్ రూపంలో మంచి ఓపెనింగ్ జోడీ ఉన్నా.. వారు రాణించడం చాలా ముఖ్యం. ఒక మిడిల్డార్‌లో కెప్టెన్ రాణా, రస్సెల్, శార్ధుల్ ఠాకూర్‌పైనే ఆధారం. రింకూ సింగ్, సునీల్ నరైన్ ఉన్నా.. పెద్దగా నమ్మకం పెట్టుకోలేం. ఇక బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్, వరణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్ ఉన్నారు. టిమ్ సౌథీ లేదా లూకీ ఫెర్గూసన్ ఇద్దరిలో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది. షకీబ్ అల్ హసన్ దూరం కావడంతో కేకేఆర్‌కు పెద్ద దెబ్బ. అయితే మ్యాచ్ వారి హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుండటం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం.
తుది జట్లు(అంచనా)
ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లసిస్, మ్యాక్స్‌వెల్, బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మాద్, దినేష్ కార్తీక్, కరన్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాశ్‌దీప్, డేవిడ్ విల్లే, సిరాజ్.
కేకేఆర్: రహమనుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితిష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, శార్దుల్ ఠాకూర్, సునీల్ నరైన్, ఫెర్గూసన్, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించే అవకాశం ఉంది.