ఐపీఎల్ 2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. ఈ సమయంలో అందరి నోటా మొదలుతోన్న ఏకైక ప్రశ్న.. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరుతుందా..? లేదా..? అన్నదే. గడిచిన పదిహేనేండ్లుగా ఒకటే కలను మళ్లీ మళ్లీ కంటున్న ఆర్‌సీబీ ఈ ఏడాదైనా ఆ కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. కాకుంటే అది రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై చేతుల్లోనే ఉంది.
ప్రతి ఏడాది లాగానే ఐపీఎల్ 2023 సీజన్ లో టైటిల్ కోసం అన్ని జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. లీగ్ దశలో ఇప్పటికే 60 మ్యాచులు ముగియగా, మరో తొమ్మిది మ్యాచులు మాత్రమే మిగిలివున్నాయి. అంటే దాదాపు టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. అయినప్పటికీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే నాలుగు జట్లేవి..? అన్నది అంతుపట్టడం లేదు. ఈ పరిస్థితులలో ఎన్నడూ టైటిల్ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు(ఆర్‌సీబీ) ఈ ఏడాదైనా ఆ కల నెరవేరుతుందా! అంది డైలమాలో పడింది. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ అర్హత సాధించే దారులు ముంబై ఇండియన్స్ విజయావకాశాలపై ఆధారపడి ఉన్నాయి. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్‌లో గడిచిన పదిహేనేండ్లుగా ఒకటే కలను మళ్లీ మళ్లీ కంటున్న జట్టు ఏది ఉందా..? అంటే అది ఖచ్చితంగా ఆర్‌సీబీనే. ప్రతి సీజన్‌కు ముందు ఆర్‌సీబీ అభిమానులు.. ‘ఈ సాలా కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే) అంటూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తారు. అందుకు తగ్గట్టుగానే ఆర్‌సీబీ లీగ్ దశలో మొదటి అర్ధభాగం పూర్తయ్యేవరకు వరుస విజయాలతో టైటిల్ రేసులో ఉన్నట్లే కనపడుతుంది. ఇక రెండో అర్ధభాగం మొదలువుతుందంటే వారి ఆశలు అడియాశలు అయ్యే కాలం మొదలైనట్లే. ఈ ఏడాది ఆర్‌సీబీ అదే స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం 12 మ్యాచుల్లో 6 విజయాలు, 6 అపజయాలతో పాయింట్స్ టేబుల్లో 5వ(12 పాయింట్లు) స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా, ఆ రెండింటిలో విజయం సాధిస్తే, దాదాలు ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు అయినట్లే.
IPL 2023 Points Table – RCB still alive.
A massive boost in the NRR for RCB! pic.twitter.com/UrwWjrIbrq
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2023
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 16 పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్ తదుపరి 2 మ్యాచుల్లో ఏ ఒక్కటి గెలిచినా 18 పాయింట్లతో ప్లేఆఫ్‌లోకి ప్రవేశిస్తుంది. అలాగే 15 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తదుపరి రెండు మ్యాచులలో రెండు గెలిస్తే, ఎలాంటి సమీకరణాలు లేకుండా నేరుగా అగ్రస్థానంలోకి దూసుకెళ్తుంది. లేదా ఒక మ్యాచులో గెలిస్తే 17 పాయింట్లకు చేరుకొని, రెండు లేదా మూడు స్థానాలలో బెర్త్ ఖరారు అవుతుంది. ఇక వరుస విజయాలతో దూకుడుమీదున్న ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో ప్రస్తుతం మూడవ స్థానంలో ఉంది. ముంబై మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా, వీరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడమన్నది వెన్నతో పెట్టిన విద్య. ఇక మిగిలింది ఒకే ఒక స్థానం.
మిగిలిన ఒక స్థానం కొరకు ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో ఢిల్లీ, సన్ రైజర్స్, కేకేఆర్ జట్లను పక్కకు పెట్టినా, రాజస్థాన్ రాయల్స్, లక్నో గెయింట్స్ రూపంలో ఆర్‌సీబీకి గట్టి పోటీ ఎదురవుతోంది. రాజస్థాన్ కు ఒక మ్యాచ్ మిగిలిఉండటం, అందులో గెలిచినా 14 పాయింట్లే ఉంటాయి కనుక అది కూడా పెద్ద ఆటకం కాకపోవచ్చు. ఇప్పుడు అసలు సమస్య.. లక్నోతోనే. ప్రస్తుతం లక్నో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ జట్టు తదుపరి రెండు మ్యాచుల్లో గెలిస్తే మొత్తం 17 పాయింట్లతో ప్లేఆఫ్‌ను ఖాయం చేసుకోవచ్చు. అదే ఏ ఒక్క మ్యాచులో ఓడినా, 15 పాయింట్లతో ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సిందే. అదే సమయంలో ఆర్‌సీబీ తదుపరి రెండు మ్యాచుల్లో గెలిస్తే, 16 పాయింట్లతో ప్లేఆప్స్ దూసుకెళ్తుంది. ఇక చెప్పుకోవాల్సింది.. లక్నోతరువాత ఆడబోయే మ్యాచ్ గురుంచి. లక్నో తదుపరి మ్యాచులో ముంబైలతో తలపడనుంది. ఈ మ్యాచులో ఆ జట్టు ఓటమి పాలవ్వడం ఆర్‌సీబీకి ఓ వరం లాంటిది. చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గెలిచినా మొత్తం 15 పాయింట్లు మాత్రమే ఉంటాయి కనుక ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ కు చేరినట్లే. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరుతుందా..? లేదా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
IPL 2023 Playoffs chances:
GT – 98%.
CSK – 90%.
MI – 80%.
LSG – 61%.RCB – 31%.
PBKS – 21%.
RR – 11%.
KKR – 6%.
SRH – 2%.
DC – 0%.#ipl2023pointstable #IPL #IPL2O23— Indian cricket news (@Pvishnoi5) May 15, 2023