IPL 2023: ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు నవీన్ ఉల్ హక్‌పై సోషల్ మీడియాలో దాడికి తెగబడ్డారు. మైదానంలో జరిగిన గొడవతో ఆగకుండా నవీన్ ఉల్ హక్ కోహ్లీని ఉద్దేశిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టడంతో
ఐపీఎల్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. మ్యాచ్‌లు చివరి బంతి వరకు వెళ్తూ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందిస్తుంటే.. ఆటగాళ్ల మధ్య గొడవలతో ఐపీఎల్ కొంత పుంతలు తొక్కుతోంది. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారిగా ఐపీఎల్‌ను హీట్ ఎక్కించింది. విరాట్ కోహ్లీ-గంభీర్‌కు పడదనే విషయం దాదాపు అందిరికీ తెలిసిందే. 2013లో ఒక సారి వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. మళ్లీ అలాంటి ఘటనను పునరావృతం చేస్తూ.. కోహ్లీ-గంభీర్ మాటమాట అనుకున్నారు.
అయితే.. వీరిద్దరి గొడవకంటే ముందు కోహ్లీతో లక్నోకు ఆడుతున్న యువ క్రికెటర్ నవీన్ ఉల్ హక్ గొడవకు దిగాడు. కోహ్లీ-నవీన్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ విషయంలో గంభీర్‌తో పాటు లక్నో టీమ్ మొత్తం నవీన్ వెంటే నిలిచింది. అయితే.. సోషల్ మీడియా వేదికగా కోహ్లీ-నవీన్ గొడవపై క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు నవీన్ ఉల్ హక్‌పై సోషల్ మీడియాలో దాడికి తెగబడ్డారు. మైదానంలో జరిగిన గొడవతో ఆగకుండా నవీన్ ఉల్ హక్ కోహ్లీని ఉద్దేశిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టడంతో కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.
మ్యాచ్ తర్వాత మ్యాచ్ రిఫరీ విరాట్ కోహ్లీ, గంభీర్, నవీన్‌లకు జరిమానా కూడా విధించాడు. అయితే.. విరాట్ కోహ్లీపై నవీన్ గొడవకు దిగడంపై బీసీసీఐ సైతం సీరియస్ అయినట్లు సమాచారం. గత మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు చేసుకున్న అతి సెలబ్రేషన్‌కు కౌంటర్‌గా సోమవారపు మ్యాచ్‌లో కోహ్లీ అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడని అందులో తప్పులేకపోయినా.. లక్నో ఆటగాళ్లు దాన్ని తీసుకోలేకపోయారని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఐపీఎల్ కమిటీలో సభ్యుడిగా ఉన్న రాజీవ్ శుక్లా బుధవారం లక్నో-చెన్నై మధ్య మ్యాచ్ సందర్భంగా నవీన్ ఉల్ హక్‌ను మందలించినట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరిగితే ఐపీఎల్ ప్రతిష్ట దెబ్బతింటుందని, కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించాలని శుక్లా.. నవీన్‌తో చెప్పినట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rajiv Shukla having a chat with Naveen Ul Haq. pic.twitter.com/LkxrMsLmIC
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2023