ఐపీఎల్ 2023 లీగ్ మ్యాచులు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఇక మిగిలింది నాలుగు మ్యాచ్ లే అయినా.. ఇప్పటివరకు కేవలం గుజరాత్ జట్టు మాత్రమే ప్లే ఆఫ్ కి వెళ్ళింది. మిగిలిన మూడు బెర్తుల కోసం మరో 6 జట్లు రేస్ లో ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో ఏ జట్లు ప్లే ఆఫ్ కి వెళ్తాయో అనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది. ఒక్కో జట్టు అవకాశాలను పరిశీలిస్తే..
ఐపీఎల్ 2023 లీగ్ మ్యాచులు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఇక మిగిలింది నాలుగు మ్యాచ్ లే అయినా.. ఇప్పటివరకు కేవలం గుజరాత్ జట్టు మాత్రమే ప్లే ఆఫ్ కి వెళ్ళింది. మిగిలిన మూడు బెర్తుల కోసం మరో 6 జట్లు రేస్ లో ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో ఏ జట్లు ప్లే ఆఫ్ కి వెళ్తాయో అనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది. ఒక్కో జట్టు అవకాశాలను పరిశీలిస్తే
1) చెన్నై సూపర్ కింగ్స్: ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక మిగిలిన చివరి మ్యాచ్ ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచులో గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్ కి వెళ్తుంది. ఒక వేళా ఈ మ్యాచులో ఓడిపోయినా చెన్నై కి అవకాశం ఉంటుంది. ముంబై లేదా బెంగళూరు జట్లలో ఒక జట్టు తమ చివరి లీగ్ మ్యాచులో ఓడిపోయినా.. లేదా లక్నో భారీ తేడాతో కోల్ కత్తా చేతిలో ఓడిపోయినా చెన్నై ప్లే ఆఫ్ కి వెళ్తుంది.
2) లక్నో సూపర్ జయింట్స్: ఈ జట్టు కూడా చెన్నై మాదిరిగానే 13 మ్యాచుల్లో 15 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి కేకేఆర్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ జట్టు కూడా చెన్నై మాదిరి.. ఈ మ్యాచులో గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్ కి వెళ్తుంది. ఒక వేళా ఈ మ్యాచులో ఓడిపోయినా లక్నోకి అవకాశం ఉంటుంది. ముంబై లేదా బెంగళూరు జట్లలో ఒక జట్టు తమ చివరి లీగ్ మ్యాచులో ఓడిపోయినా.. లేదా చెన్నై భారీ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయినా లక్నో ప్లే ఆఫ్ కి వెళ్తుంది.
3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఇప్పటివరకు 13 మ్యాచులాడిన ఆర్సీబీ.. 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్ గుజరాత్ తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ కి 99 శాతం వెళ్ళినట్లే. ఒక వేళా ఓడిపోయినా 4 పరుగుల తేడాతో లేదా 4 బంతులు మిగిలేలా చూసుకోవాలి. అదే సమయంలో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ మీద ఓడిపోవాలి.
4) ముంబై ఇండియన్స్: ప్రస్తుతం 13 మ్యాచుల్లో 14 పాయింట్ల పట్టికలో 6 వ స్థానంలో ఉంది. రన్ రేటే చాల దారుణంగా ఉండడంతో చివరి మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరాలి అదే సమయంలో లక్నో లేదా చెన్నై లేదా బెంగళూరు జట్లలో ఒకటి తమ చివరి లీగ్ మ్యాచుల్లో ఓడిపోవాలి. ఒకవేళ ఓడితే ఇక బ్యాగ్ లు సర్దుకోవాల్సిందే.
5) రాజస్థాన్ రాయల్స్: 14 మ్యాచులు ఆడిన రాజస్థాన్ 14 పాయింట్లతో 5 వ స్థానంలో నిలిచింది. ఈ జట్టు భవితవ్యం అంతా బెంగళూరు, ముంబై చేతిలోనే ఆధారపడి ఉంది. ఈ రెండు జట్లు తమ చివరి లీగ్ మ్యాచుల్లో ఖచ్చితంగా ఓడిపోతేనే ప్లే ఆఫ్ కి వెళ్తుంది. ఒక వేళా ఆర్సీబీ 3 పరుగుల తేడాతో ఓడిపోయినా.. రాజస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
6) కోల్ కత్తా నైట్ రైడర్స్: కోల్ కత్తా ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే అది జరగని పనే చెప్పుకోవాలి. ఉన్న ఒక్క మ్యాచ్ గెలిచినా.. దాదాపు 100 కి పైగా పరుగుల తేడాతో గెలవడంతో పాటు.. ముంబై, ఆర్సీబీ రెండు జట్లు కూడా తమ చివరి లీగ్ మ్యాచులో ఓడిపోవాలి.