PBKS vs LSG Prediction: నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో మంచి జోష్‌లో ఉన్న లక్నోతో పంజాబ్ తలపడబోతుంది. మరి పంజాబ్ మూడో విజయం సాధిస్తుందా? లేక లక్నో మరో విజయాన్ని అందుకుంటుందా? ఎవరి బలం ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్‌తో తలపడేందుకు లక్నో సూపర్‌జెయింట్స్ రెడీ అయిపోయింది. శనివారం కావాడంతో ఈ రోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుండగా.. రెండో మ్యాచ్ పంజాబ్-లక్నో మధ్య జరగనుంది. ఇప్పటికే మ్యాచ్‌లన్ని హోరాహోరీగా జరుగుతుండగా. ఈ మ్యాచ్‌పై సైతం క్రికెట్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి.. టోర్నీలో పటిష్టంగా మారాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. మరి విజయం ఎవర్ని వరించేలా ఉందో చూద్దాం..
పంజాబ్ కింగ్స్..
పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ సైతం వేగంగా ఆడగల సమర్థుడే. మ్యాథ్యూ షార్ట్ చివరి మ్యాచ్‌లో బాగా ఆడాడు. టాపార్డర్ బలంగానే ఉన్నా.. మిడిల్డార్ పంజాబ్‌ను కలవరపెట్టే అంశం. బౌలింగ్‌లో సామ్ కరన్, రబడాతో పటిష్టంగానే ఉన్నా.. స్పిన్ బౌలింగ్ వీక్‌గా ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్..
కెప్టెన్ కేఎల్ రాహుల్ తప్పించి మిగతా జట్టు బాగానే ఉంది. రాహుల్ ఫామ్‌లో లేకపోవడంతో లక్నోకు మంచి స్టార్ట్ లభించడం లేదు. కానీ, రాహుల్ ఒక్కసారి ఫామ్ అందుకుంటే.. లాంగ్ ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్కడే మ్యాచ్‌ను గెలిపించగలడు. అయితే.. ఈ మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ ఆడే అవకాశం కనిపిస్తోంది. స్టోయినీస్, పూరన్ చివరి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడారు. ఆర్సీబీపై 200 ప్లస్ రన్ చేసి లక్నో గెలిచిందంటే అందుకు వీళ్లిద్దరే కారణం. బ్యాటింగ్‌లో భీకరంగా ఉన్న లక్నో.. బౌలింగ్‌లో మార్క్ వుడ్ మినహా అంత బలంగా లేదు.
తుది జట్ల అంచనా..
పంజాబ్: శిఖర్ ధావన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మ్యాథ్యూ వేడ్, భానుక రాజపక్సా, జితేష్ శర్మ, సామ్ కరన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బార్, రబడా, రిషీ ధావన్, అర్షదీప్ సింగ్. (ఇంప్యాక్ట్ ప్టేయర్-రాహుల్ చాహర్)
లక్నో: కేఎల్ రాహుల్, డికాక్, దీపక్ చాహర్, మార్కస్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, జయదేవ్ ఉనద్కట్, అమిత్ మిశ్రా, ఆవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, (ఇంప్యాక్ట్ ప్టేయర్-ఆయూష్ బదోని)
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించే అవకాశం ఉంది.