ఏం కొట్టాడురా మామ..! లక్నోతో జరిగిన ధోనీ బ్యాటింగ్ చూశాక ఈ మాట తప్పకుండా అనాల్సిందే. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న బంతులను ధోనీ అంతే వేగంతో స్టాండ్స్‌లోకి పంపించాడు.
ఆఖరి ఓవర్‌లో ధోనీ క్రీజులో ఉన్నాడంటే ఏం జరుగుతుందో అందరకీ విదితమే. బౌలర్ ఎవరైనా.. బంతి స్టాండ్స్‌లోకి వెళ్లాల్సిందే. ధోని ఖాతాలో అలాంటి మెరుపు మెరిపించి ఆఖరి ఓవర్లు ఎన్నో ఉన్నాయి. కానీ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాక ధోని నుండి అలాంటి షాట్లు దాదాపు కనుమరుగయ్యాయనే చెప్పాలి. ఏదో వస్తాడమ్మా.. పోతాడమ్మా అన్నట్లు 20 నుంచి పరుగులు చేసేవాడు. కానీ, ఈ సీజన్ లో ధోనీ ఆట తీరు భిన్నంగా ఉంటోంది. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ఈ కెప్టెన్ కూల్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడు. తాజగా, లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో మహేంద్రుడు.. తొలి రెండు బంతులను రెండు సిక్సర్లు బాది బౌలర్ ను కళ్లు తేలేసేలా చేశాడు.
సాధారణంగా వయసు మీద పడుతున్న కొద్ది ఏ ఆటగాడిలోనైనా పస తగ్గుతుంది. కానీ ధోని అందుకు మినహాయింపు. వయస్సుతో పని లేదంటున్నాడు. కొడితే బాల్ స్టేడియంలోకి వెళ్లాల్సిందే అంటున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన వరుస సిక్సర్లు బాదిన ధోనీ తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించాడు.మొత్తంగా 3 బంతులు ఎదుర్కొన్న ధోని మొదట రెండు బంతులను స్టాండ్స్ లోకి పంపగా, మూడో బంతికి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. కాగా, ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు నష్టానికి 217 పరుగులు చేసింది.
Two back to back six by GOAT MS DHONI. 🐐#CSKvLSG | #MSDhoni𓃵pic.twitter.com/SWdaeAbUkt
— Sexy Cricket Shots (@sexycricketshot) April 3, 2023
సొంత గ్రౌండ్‌లో రెచ్చిపోయిన రుతురాజ్ గైక్వాడ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చెలరేగి అర్ధ సెంచరీ బాదాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు పూర్తిచేశాడు. రుతురాజ్ దెబ్బకు చెన్నై స్కోరుబోర్డు పరుగులు తీసింది. దీనికి తోడు డెవోన్ కాన్వే(47) కూడా బ్యాట్ ఝళిపించడంతో లక్నో బౌలర్లు బెంబేలెత్తారు. ఇద్దరూ కలిసి లక్నో బౌలర్లను ఆటాడుకున్నారు.అనంతరం శివం దూబే (27), మోయిన్ అలీ (19) రాణించడం.. చివర్లో అంబటి రాయుడు(27) మెరుపులు మెరిపించడంతో స్కోర్ రెండొందలు దాటింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, మార్క్ వుడ్ తలా మూడు వికెట్లు తీశారు. అవేశ్ ఖాన్‌కు ఒక వికెట్ దక్కింది.
CSK: 217-7(20)
A brilliant opening partnership and a strong finish from Ambati Rayudu and MS Dhoni guided CSK to a big total 🔥#MSDhoni #RuturajGaikwad #AmbatiRayudu #CSKvsLSG #IPL2023 #Cricket pic.twitter.com/6INF0LHD7h
— Wisden India (@WisdenIndia) April 3, 2023