MI vs DC Prediction: ఈ ఐపీఎల్ సీజన్‌లో ఒక్క విజయం కూడా లేని జట్లు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఏదో ఒక జట్టు ఈ రోజు విజయం దక్కనుంది. మరి ఆ తొలి విజయం ఎవరికి దక్కుతుందంటే..?
ఐపీఎల్ 2023లో మ్యాచ్‌లు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను మించి జరుగుతున్నాయి. ఊహకు అందని ఫలితాలతో ఐపీఎల్‌పై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచేస్తున్నాయి. ఆదివారం కేకేఆర్ యువ క్రికెటర్ రింకూ సింగ్ చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సులు బాది తన జట్టును గెలిపిస్తే.. సోమవారం ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్ సైతం చివరి బాల్ వరకు వెళ్లింది. ఇలా ఈ సీజన్ ఐపీఎల్‌లో మ్యాచ్‌లు నెక్ట్స్ లెవెల్‌లో జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ముంబై వర్సెస్ ఢిల్లీ పోరు జరగనుంది. ఈ రెండు జట్లకు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ విజయం కూడా లేదు. అన్ని జట్లు విజయం రుచి చూశాయి.. మరి వీరిద్దరి మధ్య మ్యాచ్‌తో ఎవరో ఒకరికి తొలి విజయం దక్కనుంది. మరి ఈ సీజన్‌లో తొలి విజయం అందుకోనున్న జట్టు ఏదో ఇప్పుడు చూద్దాం..
మంబై ఇండియన్స్..
గత సీజన్‌లో వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్.. ఈ సీజన్‌ను సైతం ఓటమితోనే మొదలుపెట్టింది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లోనూ ఓడింది. ఆర్సీబీ, సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై.. ఢిల్లీపై ఎలాగైనా గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే ముంబైని ప్రధానంగా ఓపెనింగ్ సమస్య వేధిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు ఒక్క పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. అలాగే జట్టులోని మిడిల్డార్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, కామెరున్ గ్రీన్ దారుణంగా విఫలం అవుతుండటం కూడా ముంబైకి పెద్ద మైనస్‌గా మారింది. ఇక బౌలింగ్‌లో కూడా ముంబై వీక్‌గా కనిపిస్తోంది. అయితే.. బ్యాటర్లు వారి స్థాయి ఫామ్‌లోకి వస్తే.. బౌలింగ్ వీక్నెస్‌ను అధిగమించడం పెద్ద విషయం కాదు.
ఢిల్లీ క్యాపిటల్స్..
ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనే ఓటమి పాలైంది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ బ్యాటింగ్‌లో కెప్టెన్ వార్నర్ మాత్రమే నిలకడగా ఆడుతున్నాడు. మిగిలిన బ్యాటర్లు విఫలం అవుతున్నారు. యువ ఓపెనర్ పృథ్వీ షా అయితే అత్యంత ఫేలవ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. అలాగే ఢిల్లీ మిడిల్డార్ సైతం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇక బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి మేటి స్పిన్నర్లు ఉన్నా.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలేదు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
తుది జట్ల అంచనా..
ముంబై: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరున్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకిన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ.
ఢిల్లీ: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, లుంగి ఎన్గిడి.
ప్రెడిక్షన్..
ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించే అవకాశం ఉంది.