IPL 2023 లో శనివారం రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మెుదటి మ్యాచ్ లో పంజాబ్ తో తలపడుతోంది కేకేఆర్ జట్టు. ఇక సాయంత్రం రెండో మ్యాచ్ లో సమవుజ్జీల సమరం సాగనుంది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొనబోతున్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలవబోతోందో ఇప్పుడు అంచనా వేద్దాం.
క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూసిన మెగా టోర్నీ IPL 2023 అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఇక తొలి మ్యాచ్ లోనే అభిమానులకు అసలైన మజాను చూపించాయి చెన్నై, గుజరాత్ జట్లు. ఇక వీకెండ్ రోజు రెండు మ్యాచ్ లు ఉండటంతో.. క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ కుషీలో ఉన్నారు. శనివారం మెుదటి మ్యాచ్ లో పంజాబ్ తో తలపడుతోంది కేకేఆర్ జట్టు. ఇక సాయంత్రం రెండో మ్యాచ్ లో సమవుజ్జీల సమరం సాగనుంది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొనబోతున్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు పటిష్టంగానే కనిపిస్తున్నాయి. ముందుగా లక్నో జట్టు విషయానికి వస్తే.. ఐపీఎల్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా ముద్ర వేసుకున్న కేఎల్ రాహుల్ లక్నో జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ ఫామ్ పైనే లక్నో జట్టు భవిష్యత్ ఆధారపడి ఉంది. లక్నో టీమ్ లో రాహుల్ తో పాటుగా కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, స్టోయినిస్, కృనాల్ పాండ్యా లాంటి హిట్టర్లలో భీకరంగా ఉంది. వీరిలో ఏ ఒక్కరు స్టాండ్ అయినా ఢిల్లీకి తిప్పలు తప్పవు. ఇక వేలంలో పూరన్ ను రూ. 16 కోట్ల భారీ ధరకు లక్నో దక్కించుకుంది. కాగా ఆ ధరకు పూరన్ ఏ మేరకు న్యాయం చేస్తాడో చూడాలి.
ఇక బౌలింగ్ లో స్టార్ బౌలర్ ఉనద్కత్ కు తోడుగా ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, డానియల్ సామ్స్, ఐపీఎల్ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా లు ఉన్నారు. ఇక ఢిల్లీ జట్టు విషయానికి వస్తే.. రిషభ్ పంత్ లేకపోవడం ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బే అని మెుదటి నుంచి చెప్పుకొస్తూనే ఉన్నారు మాజీలు. అయితే పంత్ లేకపోవడంతో.. డేవిడ్ వార్నర్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఢిల్లీ టీమ్ లో స్టార్ బ్యాటర్లకు కొదవలేదు. పృథ్వీ షా, రైలీ రూసో, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్, పావెల్, అక్షర్ పటేల్, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్,ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా లు ఉన్నారు. ఇరు జట్లలో ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే ఆటగాళ్లు ఉన్నారు. ఇక డేవిడ్ వార్నర్ ఐపీఎల్ అంటేనే చెలరేగిపోతాడు అనే పేరు ఉంది. అతడికి తోడు డాషింగ్ బ్యాటర్ పృథ్వీ షా, నయా సంచలనం సర్ఫరాజ్ ఖాన్ లు ఉండనే ఉన్నారు. వారీతో పాటుగా కరేబియన్ విధ్వంసకర వీరుడు పావెల్ ఢిల్లీకి అదనపు బలం.
కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, నికోలస్ పూరన్,స్టోయినిస్, కృనాల్ పాండ్యా, జైదేవ్ ఉనద్కత్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, రోమారియో షెఫర్డ్, అమిత్ మిశ్రా.
డేవిడ్ వార్నర్(కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, ఫిలిఫ్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్, పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, నాగర్ కోటి
ప్రెడిక్షన్: ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలిచే అవకాశం ఉంది.
(గమనిక: ఐపీఎల్ లో చివరి బంతితో మ్యాచ్ ఫలితం మారిపోవచ్చు. కాబట్టి పైన చెప్పిన అంచనాలు కొన్నిసార్లు తప్పొచ్చు. వ్యూయర్స్ గమనించగలరు)