మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2023 లీగ్ ప్రారంభం కానుంది. ఏ జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుంది? ఈసారి ఎవరు రాణిస్తారు? అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి లీగ్ లో కేకేఆర్ జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతోంది? కప్పు కొడతారా? అనే విషయాలను పరిశీలిద్దాం.
మరికొన్ని గంటల్లో ధనా ధన్ లీగ్ ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. ఈసారి కూడా తామంటే తాము కప్పు కొడతామంటూ అన్ని జట్లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆఖరికి ఆ కప్పు ఎవరో ఒక్కరికి మాత్రమే దక్కుతుంది. ఆ జట్టు ఎవరై ఉంటారనే విషయంపై ఇప్పటికే చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేకేఆర్ ఫ్యాన్స్ మాత్రం తమ జట్టు కప్పు కొట్టి తీరుతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఎలా ఉంది? వారి బలాలు ఏంటి? వారి బలహీనతలు ఏంటి? నిజంగానే ఆ జట్టుకు ఈసారి కప్పు కొట్టే సీన్ ఉందా? అనే విషయాలను పరిశీలిద్దాం.
ఈ ఏడాది కోల్ కతా నైట్ రైడర్స్ చాలా ప్రయోగాలు చేయబోతోందనే చెప్పాలి. వారి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో కెప్టెన్ గా నితీశ్ రాణా రూపంలో మంచి రీప్లేస్ మెంట్ దొరికిందనే చెప్పాలి. కానీ, సమర్థంగా జట్టును నడింపిచగలడా అనే అనుమానం మాత్రం లేకపోలేదు. బ్యాటింగ్ పరంగా నితీశ్ రాణా జట్టుకు బలమనే చెప్పాలి. నితీశ్ రాణా విఫలమైనా కూడా ఆండ్రూ రస్సెల్, షకీబ్ అల్ హసన్ ఆదుకోగలరు. రహమనుల్లా గుర్బాజ్ కూడా మంచి ఎంపికనే చెప్పాలి. సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ లాంటి వాళ్లు ఉండనే ఉన్నారు. వీళ్లు క్లిక్ అయితే స్కోర్ బోర్డు కచ్చితంగా పరగులు పెడుతుంది. బ్యాటింగ్ పరంగా కేకేఆర్ మంచి లైనప్ ఉంది.
బౌలింగ్ విషయానికి వస్తే.. సునీల్ నరైన్ పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభానికి ముందే నరైన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల ఓ క్లబ్ క్రికెట్ లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇంక ఉమేష్ యాదవ్ కూడా ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ లో 3 వికెట్లతో ఫామ్ లో కనిపించాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో టచ్ లో ఉంటే తిరుగుండదనే చెప్పాలి. ఇంక మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తి కూడా జట్టు అదనపు బలమే అవుతాడు. ఓవర్ నైట్ స్టార్ వెంకటేశ్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే టీమిండియాలో స్థానం కోల్పోయిన తర్వాత అయ్యర్ ప్రదర్శనపై అభిమానులకు కూడా అంత గురి కుదరడం లేదు. ఈ సీజన్లో బౌలింగ్ తో కూడా కేకేఆర్ సత్తా చాటగలిగితే కప్పు కొట్టడం అసాధ్యమని చెప్పలేం. అయితే సమష్టి కృషి అనేది తప్పుకుండా అవసరం ఉంది.
జట్టులో ఎవరినైతే బలమని భావిస్తామో.. వాళ్లే బలహీనతగా కూడా మారే అవకాశం ఉంటుంది. నితీశ్ రాణా బ్యాటింగ్ లో బాగా రాణిస్తాడు. ఒక్క డెబ్యూ సీజన్ తప్ప మిగిలిన అన్ని సీజన్లలో 300కు పైగా పరుగులు చేశాడు. కానీ, కొత్తగా కెప్టెన్సీ రావడం అనేది అతని బ్యాటింగ్ పై ప్రభావం చూపిస్తే నితీశ్ కచ్చితంగా జట్టు బలహీనత కాగలడు. అలాగే నరైన్ బౌలింగ్ తోనే కాదు.. బ్యాటింగ్ తో కూడా రాణించాల్సి ఉంటుంది. అనవసరపు షాట్స్ ఆడకుండా ఉంటే నరైన్ ఎంతో బలం అవుతాడు. షకీబ్ అల్ హసన్ కూడా బిగ్ అసెట్ కానీ, ఎప్పుడు ఎలా ఫామ్ లోకి వస్తాడు అనేది చెప్పలేం.
ఆండ్రూ రస్సెల్ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్నే తారుమారు చేయగలడు. కానీ, ఫామ్ లో ఉంటాడా? అనేది మొదటి ప్రశ్న. శార్దూల్ ఠాకూల్, వరుణ్ చక్రవర్తి ఫామ్ లో ఉండాల్సిందే. వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆల్ రౌండర్ టచ్ లోకి రావాల్సిన అవసరం జట్టుకు ఎంతైనా ఉంది. బ్యాటింగ్- బౌలింగ్ లో అయ్యర్ నిలదొక్కుకోకపోతే కేకేఆర్ కు భారీ నష్టం జరగచ్చు. వాళ్లు ఫామ్ లోకి రాకపోతే జట్టుకు లాభం చేయకపోగా.. నష్టం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లేయర్లు అందరూ ఆశించిన స్థాయిలో రాణిస్తే.. ఈ ఐపీఎల్ 2023లో కప్పు కొట్టడం కష్టం కాదనే చెప్పాలి. కేకేఆర్ జట్టుకు కప్పుకు కొట్టడం సాధ్యమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🎥 | Mini Travel Vlog ➡️ Touchdown Mohali📍#AmiKKR #TATAIPL2023 #ReelKaroFeelKaro #ReelItFeelIt #Travel pic.twitter.com/4Yjo374tle
— KolkataKnightRiders (@KKRiders) March 29, 2023