KKR vs SRH Prediction: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. రెండో విజయం కోసం.. శుక్రవారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. మరి సన్‌రైజర్స్‌కు విజయావకాశాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ 2023లో మ్యాచ్‌లో ఒకదాన్ని మించి మరొకటి జరుగుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి అన్ని మ్యాచ్‌లు ఉత్కంట భరితంగా సాగుతూ.. క్రికెట్ అభిమానులను కుర్చీల్లో కూర్చోనివ్వడం లేదు. గురువారం పంజాబ్-గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్ సైతం థ్రిల్లింగ్‌గానే ముగిసింది. ఈ క్రమంలో మరో బిగ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు తలపడనుంది. మరి ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఏదో? ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్..
ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక విజయం దక్కించుకుంది. ఇప్పుడు రెండో విజయం కోసం కేకేఆర్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్‌ను ఓపెనింగ్ సమస్య వేధిస్తోంది. హ్యరీ బ్రూక్‌ను ఓపెనర్‌గా దింపినా రాణించలేదు. రాహుల్ త్రిపాఠి టచ్‌లోకి రావడంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ కాస్త బలపడింది. త్రిపాఠికి తోడు కెప్టెన్ మార్కరమ్ సైతం బ్యాట్ ఝుళిపిస్తే.. సన్‌రైజర్స్ మంచి స్కోర్ చేయడం ఖాయం. ఇక యువ క్రికెట్ అబ్దుల్ సమద్, క్లాసెన్, వాషింగ్టన్ సుందర్ సైతం బ్యాటింగ్‌లో కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. బౌలింగ్‌లో జాన్సెన్, భువీ, ఉమ్రాన్ మాలిక్ భారీగా పరుగులు ఇస్తుండటం మైనస్‌గా మారింది.
కోల్‌కత్తా నైట్‌రైజర్స్..
మూడు మ్యాచ్‌ల్లో కేకేఆర్ రెండు విజయాలు సాధించి మంచి జోష్‌లోనే ఉంది. చివరి మ్యాచ్‌లో రింకూ సింగ్ ఐదు సిక్సులతో అందించిన విక్టరీతో కేకేఆర్ ఉత్సాహంతో ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ స్థానంలో జాసన్ రాయ్ ఆడే ఆస్కారం ఉంది. గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ సైతం అదరగొట్టడంతో కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా మారింది. రస్సెల్, కెప్టెన్ నితీష్ రాణా, రింకూ సింగ్‌తో బ్యాటింగ్ బాగానే ఉంది. ఇక బౌలింగ్‌లోనూ సునీల్ నరైన్, వరణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్, ఫెర్గూసన్, శార్దుల్ ఠాకూర్‌తో బౌలింగ్ కూడా బలంగానే ఉంది.
తుది జట్ల అంచనా..
SRH: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువీ, ఉమ్రాన్ మాలిక్.
KKR: జాసన్ రాయ్, జగదీశన్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దుల్ ఠాకూర్, లూకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరణ్ చక్రవర్తి.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా జట్టు విజయం సాధించే అవకాశం ఉంది.
Voicing the love for 𝐚𝐦𝐚𝐝𝐞𝐫 𝐩𝐫𝐢𝐲𝐨 𝐊𝐊𝐑 ft. Arkadeep Mishra from Folk Diaryz 💜💛#KKRvSRH | #AmiKKR | #TATAIPL 2023 pic.twitter.com/DWxIAq9LIs
— KolkataKnightRiders (@KKRiders) April 14, 2023