KKR vs GT Match fixing: చివరి ఓవర్‌లో విజయానికి 29 పరుగులు అవసరమైన దశలో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఐదు వరుస సిక్సులతో సంచలనం విజయం నమోదు చేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌పై ఇప్పుడు ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2023లో ఆదివారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏ రేంజ్ ఫలితం వచ్చిందో అందరికి తెలిసిందే. నిజం చెప్పాలంటే ఆ ఫలితాన్ని కేకేఆర్ ఆటగాళ్లు, వీరాభిమానులు కూడా ఆశించి ఉండరు. ఎందుకంటే.. చివరి ఐదు బంతుల్లో 28 పరుగులు కావాలి. క్రీజ్‌లో ఏ రస్సెలో, ధోనినో ఉంటే క్రికెట్ అభిమానుల్లో ఓ పది శాతం హోప్స్ ఉండొచ్చు. కానీ.. రింకూ సింగ్ అనే ఓ యువ క్రికెటర్ ఉన్నాడు. దీంతో పెద్దగా ఎవరికీ మ్యాచ్‌పై అంచనాలు లేవు. గుజరాత్ బౌలర్ దయాళ్ వేసిన చివరి ఓవర్ రెండో బంతిని రింకూ సిక్స్ కొట్టాడు. చివర్లో ఒకటి రెండు సిక్సులు కామనే అనుకున్నారంతా.. వెంటనే మరో సిక్స్.. కాస్త చలనం వచ్చింది. నాలుగో బంతికి కూడా సిక్స్. డకౌట్‌లో కూర్చున్న కేకేఆర్ ఆటగాళ్లు కుర్చీ చివర్లకు వచ్చాడు. 2 బంతుల్లో 10 పరుగుల కావాలి. ఇప్పటికీ అసాధ్యమే. కానీ.. చిన్న ఆశ.
ఐదో బంతికి కూడా భారీ సిక్స్.. అంతే ఒక్క బంతికి 4 పరుగులు మాత్రమే కావాలి. చివరి ఐదు బంతులు మిగిలి ఉండే వరకు గుజరాత్ గుప్పిట్లో ఉన్న విజయం.. రింకూ సిక్సులతో ఇరు జట్ల మధ్యలోకి వచ్చి చేరింది. కెప్టెన్ రషీద్ ఖాన్, శుబ్‌మన్ గిల్, దయాళ్‌తో చర్చలు జరిపి చివరి బాల్ వేసేందుకు ధైర్యాన్ని ఇచ్చారు. కానీ.. రింకూ దాన్ని కూడా భారీ సిక్స్‌గా మలచి.. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడు. చివరి ఐదు బంతులను ఐదు సిక్సులుగా మలచి.. కేకేఆర్‌కు అపూర్వవిజయాన్ని అందించాడు. దీంతో డకౌట్‌లో కూర్చున్న కేకేఆర్ ఆటగాళ్లు ట్రోఫీ గెలిచినంత సంబురాలు చేసుకున్నారు. గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చి.. రింకూను చుట్టేశారు. ఈ ఉద్విగ్న క్షణాలను ఆదివారం క్రికెట్ అభిమానులు అస్వాదించారు. అయితే.. ఇదంతా ఫిక్సింగ్ అంటూ సంచనల వాదన తెరపైకి వచ్చింది. దీంతో క్రికెట్ అభిమానులు ఏంటి ఇదంతా ఫేకా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఐపీఎల్‌కు హైప్ తీసుకొచ్చేందుకు, భారీ బెట్టింగ్‌లు నిర్వహించేందుకు.. ఇలాంటి మ్యాచ్‌లను ఫిక్స్ చేస్తారని, లేకుంటే.. కీలకమైన చివరి ఓవర్‌లో ఏ బౌలరైనా మూడు వరుస టాస్ బంతులు వేస్తాడా? అంటూ కొంతమంది బెట్టింగ్ బాబులు అర్థంలేని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. క్రికెట్‌ను ఆస్వాదించలేని వాళ్లు, కేవలం బెట్టింగ్‌ల కోసమే క్రికెట్ చూసే వాళ్లే ఎక్కువగా ఇలాంటి కామెంట్లు చేస్తున్నారంటూ.. క్రికెట్ ఫ్యాన్స్ ఫిక్సింగ్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. కేకేఆర్-గుజరాత్ మ్యాచ అద్భుతంగా జరిగిందని, రింకూ చివర్లో అద్భుతంగా ఆడాడని, దయాళ్ కాస్త ఒత్తిడి గురై.. టాస్ బాల్స్ వేశాడుగానీ.. ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్‌కు అస్కారమే లేదంటూ క్రికెట్ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. క్రికెట్‌లోని మజాను అస్వాదించలేని వాళ్లు పుట్టించే పుకార్లు తప్పా.. అలాంటిదేం లేదంటూ క్రికెట్ ఫ్యాన్స్ సైతం వారికి కౌంటర్ ఇస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
History created by Rinku Singh.
What a finish. pic.twitter.com/NDAiGjQVoI
— Johns. (@CricCrazyJohns) April 9, 2023