IPL 2023 సీజన్ ను క్రికెట్ అభిమానుల కోసం ఉచితంగా ప్రసారం చేస్తామని జియో సినిమా వారు ప్రకటించారు. దాంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే వారి ఆనందం ఎక్కువ సేపు కూడా లేదు. ఫ్రీ అనగానే అందరు ఒక్కసారిగా లాగిన్ అవ్వడంతో.. జియో యాప్ క్రాష్ అయ్యింది.
2023 IPL అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఇక తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్ టైటాన్స్ తో తలపడుతోంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే గతంలో ఈ ఐపీఎల్ మ్యాచ్ లను చూడాలి అంటే హాట్ స్టార్ లేదా మరికొన్ని యాప్స్ సబ్ స్క్రిప్షన్ కంపల్సరిగా ఉండాలి. అయితే ఈ సీజన్ ను క్రికెట్ అభిమానుల కోసం ఉచితంగా ప్రసారం చేస్తామని జియో సినిమా వారు ప్రకటించారు. దాంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే వారి ఆనందం తొలి మ్యాచ్ తోనే ఆవిరైపోయింది. ఎందుకంటే.. తొలి మ్యాచ్ చూస్తుంటేనే జియో సినిమా యాప్ క్రాష్ అయ్యింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
2023 ఐపీఎల్ ను ఉచితంగా ప్రసారం చేస్తామని ప్రకటించింది జియో టీవీ ప్రకటించింది. మెుత్తం 11 భాషల్లో జియో సినిమా, జియో టీవీ యాప్స్ లతో పాటుగా జియో సిమ్ కార్డు వాడుతున్న వారు ఈ సారి ఐపీఎల్ మ్యాచ్ లు ఉచితంగా జియో నిర్ణయం తీసుకుంది. దాంతో జియో యూజర్లు, క్రికెట్ అభిమానులు తెగ సంబర పడ్డారు. అయితే వారి సంతోషం తొలి మ్యాచ్ కే ఆవిరి అయ్యింది. గుజరాత్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరుగుతుంటే జియో సినిమా యాప్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. దాంతో మ్యాచ్ ప్రసారం ఒక్కసారిగా ఆగిపోయింది. అన్ని భాషల్లో ఈ విధంగానే జరిగింది. ఈ షాకింగ్ సంఘటనతో క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జియో సినిమా టీవీ పని చేయడం లేదు అంటూ ట్వీటర్ వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. అయితే ఉచితంగా చూడొచ్చు అనగానే అందరు ఒక్కసారిగా లాగిన్ అవ్వడంతో.. యాప్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది.
@JioCinema_Care Hindi and English streaming is not working in Tv.#JioCinema@JioCinema #IPL2023 pic.twitter.com/FPhgslyLbk
— 𝑫𝑬𝑽𝑬𝑺𝑯 (@RealDevesh7) March 31, 2023