ఐపీఎల్ 2023లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ వెళ్తూ వెళ్తూ బెంగుళూరును కూడా వెంటబెట్టకెళ్లాలని చూస్తోంది. ఈ క్రమంలో తెలుగు అభిమానులు వింత కోరిక కోరుతున్నారు. తమ అభిమాన జట్టు ఓడిపోవాలని కోరుకుంటున్నారు.
గత నెల రోజులుగా అభిమానులకు వినోదాన్ని పంచుతూ వస్తోన్న ఐపీఎల్ 2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. లీగ్ దశలో మరో 6 మ్యాచులు మాత్రమే మిగిలివున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా, మరో మూడు బెర్తుల కోసం 7 జట్ల తీవ్ర పోటీ నెలకొంది. 13 మ్యాచుల్లో 7 విజయాలతో చెన్నై, లక్నో.. రెండు.. మూడు స్థానాల్లో ఉండగా, 14 పాయింట్లతో ముంబై నాలుగో స్థానంలో, 12 మ్యాచుల్లో 6 విజయాలు సాధించిన బెంగుళూరు ఐదో స్థానంలో(12 పాయింట్లు) ఉంది. ఈ క్రమంలో ఇవాళ జరగనున్న మ్యాచ్ ఆర్‌సీబీకి కీలకం కానుంది. గెలిస్తే ప్లేఆఫ్ రేసులోకి లేదంటే ఇతర జట్ల విజయావకాశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ సొంత అభిమానులు వింత కోరిక కోరుతున్నారు. తమ అభిమాన జట్టు ఓడిపోవాలని కోరుకుంటున్నారు.
సొంత అభిమానులు ఈ విధమైన కోరిక కోరడం వెనుక బలమైన కారణమే ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్, ఇవాళ్టి మ్యాచులో గెలిచినా పెద్దగా ప్రయోజనం చేకూరదు. అదే బెంగుళూరు గెలిస్తే, టాప్ 4లోకి ఎంట్రీ ఇస్తుంది. దక్షణాది నుంచి మరో జట్టుకు అవకాశం ఇవ్వాలన్నది వారి కోరిక. ఒకవేళ ఈ మ్యాచులో ఆర్‌సీబీ ఓడితే.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ బెర్తులను కన్ఫార్మ్ చేసుకుంటాయి. మిగిలిన బెర్త్ కోసం కేకేఆర్, ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ పోటీ పడతాయి. అదే జరిగితే గుజరాత్ తో కలుపుకొని ఉత్తరాది నుంచి మూడు జట్లు టైటిల్ రేసులో నిలబడతాయి. అప్పుడు దక్షిణాది నుంచి చెన్నై ఒక్కటే టైటిల్ పోరులో ఉంటుంది. అందువల్లనే తెలుగు అభిమానులు ఇవాళ్టి మ్యాచులో సన్‌రైజర్స్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు.
Scenario in today’s match:
•If SRH beat RCB today – CSK & LSG will qualify for the playoffs of this IPL 2023.
•If RCB beat SRH today – RCB will moves to No.4 position in the points table of this IPL 2023. pic.twitter.com/Gu9BF2xHMh
— CricketMAN2 (@ImTanujSingh) May 18, 2023
అభిమానులు కోరినట్టుగా ఈ మ్యాచులో సన్‌రైజర్స్ ఓడినా, ఆర్‌సీబీ నేరుగా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించదు. గుజరాత్ టైటాన్స్ తో జరగబోయే తరువాత మ్యాచులో కూడా విజయం సాధించాల్సి ఉంటుంది. లేదంటే ఇతర విజయావకాశాలపై ఆధారపడాలి. అప్పుడు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ రిజల్ట్ ప్లేఆఫ్స్ బెర్తులను డిసైడ్ చేస్తుంది. అయితే ఐపీఎల్‌లో బెంగళూరుకి మొదటి నుంచి షాకులు ఇస్తున్న టీమ్ ఏదైనా ఉందంటే అది హైదరాబాదే. మొదటిసారి 2009 ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించిన డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. ఆనాటి నుంచి 2013, 15, 16, 20, 21, 22 సీజన్లలో కూడా ఆర్‌సీబీకి అలాంటి అనుభవమే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ విజయం సాధించగలదా! అన్నది అనుమానమే. అయితే తెలుగు అభిమానులు కోరినట్లుగా ఈ మ్యాచులో ఆర్‌సీబీ గెలుపొందాలని మనమూ కోరుకుందాం..
Not a good record for RCB against SRH in Hyderabad.
Can they turn the tide in their favour tonight?
📸: IPL/BCCI#IPL2023 #SRHvsRCB #CricTracker pic.twitter.com/dapMN9gWaa
— CricTracker (@Cricketracker) May 18, 2023
Ok ivala double duty cheddam #SRHvsRCB @SunRisers pic.twitter.com/r4K1VmkMyM
— బ్రూక్ యువసేన🥳 (@foreversenani13) May 18, 2023
No doubt….this time aslo #RCB is going to get Assam tickets. 😂😂#SRHvsRCB #Kohli #markram #IPLPlayOffs #IPL2023 #IPL #ViratKohli pic.twitter.com/jJUHQ5nDze
— pc and it aspirant (@nenavat_jagan) May 18, 2023
The massive day is here for RCB – a win gonna keep them alive or else it’s almost done for them this season.
The #VictoryHavan for team’s win! #cricket #Playoffs #SRHvRCB. pic.twitter.com/is6xrTgdi4
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2023