ఇన్నాళ్లు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క. హైదరాబాద్ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చేశారు. ఇక ప్రత్యర్థి జట్లకు దబిడిదిబిడే. రెండ్రోజుల క్రితం పంజాబ్ తో జరిగిన సునాయాస విజయం అందుకున్న ఎస్‌ఆర్‌హెచ్ సేన.. నేడు కేకేఆర్ తో జరిగిన మ్యాచులో బౌండరీల వర్షం కురిపించింది.
మొదటి రెండు మ్యాచుల్లో ఓడి అభిమానులను నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తానికి గాడిలో పడినట్లే కనిపిస్తోంది. రెండ్రోజుల క్రితం పంజాబ్‌తో జరిగిన సునాయాస విజయం అందుకున్న ఎస్‌ఆర్‌హెచ్ సేన.. నేడు కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో బౌండరీల వర్షం కురిపించింది. ముఖ్యంగా రూ.13 కోట్ల ఖరీదైన ఆటగాడు హ్యారీ బ్రూక్.. కేకేఆర్ బౌలర్లను చీల్చిచెండాడాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగిన బ్రూక్ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న బ్రూక్ 12ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. అతని ధాటికి ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది.
టాస్ గెలిచి కేకేఆర్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు.. ధనాధన్ హిట్టింగ్‌కు తెరలేపారు. ఉమేశ్ యాదవ్ వేసిన మొదటి ఓవర్‌లోనే హ్యారీ బ్రూక్ ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. దాంతో తొలి ఓవర్‌లోనే 14 పరుగులు వచ్చాయి. అనంతరం రెండో ఓవర్‌లో.. 14, మూడో ఓవర్ లో.. 15 పరుగులు రావడంతో తొలి మూడు ఓవర్లలోనే హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ఆపై మయాంక్ అగర్వాల్(9), రాహుల్ త్రిపాఠి(9) వెంటవెంటనే ఔటైన.. బ్రూక్- మార్క్రమ్ జోడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేసిన మార్క్రమ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ఆపై క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ(17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సైతం మెరుపులు మెరిపించడంతో ఎస్‌ఆర్‌హెచ్ 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ 3 వికెట్లు తీసుకోగా, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టాడు.
Harry Brook, turning out to be the 𝗦𝗮𝘂𝗰𝗲rer’s stone 🪄
The 𝐌𝐀𝐈𝐃𝐄𝐍 𝐈𝐏𝐋 💯 we all waited for 😍 | @Harry_Brook_88 pic.twitter.com/BV5Hc2Nm17
— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2023
🪄 🔙 pic.twitter.com/D5NlyGB6Wb
— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2023
Arey Harry Brook show start ayindi, nen malla chesthaa 😍😄 pic.twitter.com/uRINTYjBxm
— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2023