మొహాలీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. పంజాబ్ కెప్టెన్ ధావన్ సూపర్ ఫామ్ లో ఉండగా.. అటు రషీద్ ఖాన్ అద్భుత బౌలింగ్ తో అదగొడుతున్నాడు. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
ఐపీఎల్ 2023లో మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. నాలుగు రోజులుగా దాదాపు ప్రతి మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్తూ.. క్రికెట్ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠతో కూడిన వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో మరో బిగ్ మ్యాచ్‌కు టాస్ పడనుంది. మొహాలీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఈ రెండు జట్లు సైతం.. మూడేసి మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించాయి. ముచ్చటగా మూడో గెలుపు కోసం ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే.. మరి ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఐపీఎల్ 2023లో భాగంగా.. గురువారం రాత్రి బిగ్ మ్యాచ్ కు తెరలేవనుంది. గత మ్యాచ్ ల్లో దెబ్బ తిన్న ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. హైదరాబాద్ చేతిలో ఓడిన పంజాబ్, అటు కోల్ కత్తా చేతిలో గెలిచే మ్యాచ్ లో ఓడిన గుజరాత్ లు ఈ రోజు తలపడబోతున్నాయి. అయితే ఇరు జట్లలో మ్యాచ్ ను ఒంటి చేత్తో మార్చగల సత్తా ఉన్న బ్యాటర్లు ఉన్నాయి.
ముందుగా పంజాబ్ బలాలు, బలహీనతల గురించి చెప్పుకొవాల్సి వస్తే.. శిఖర్ ధావన్ పంజాబ్ కు ప్రధాన బలం. ఇక మిగతా వారిలో యంగ్ మెన్ ప్రభ్ మన్ సింగ్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. మిగతా వారిలో సామ్ కర్రన్, మాథ్యూ షార్ట్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్ లు అంచనాలకు తగ్గట్లుగా రాణించడం లేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే నాథన్ ఎల్లిస్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ లతో పాటుగా నయా సంచలనం అర్ష్ దీప్ సింగ్, రబాడ లు పటిష్టంగా కనిపిస్తున్నారు. అయితే హైదరాబాద్ తో మ్యాచ్ లో రాజపక్స గాయపడటం పంజాబ్ కు పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు. సికిందర్ రజా ఇంకా ఫామ్ లోకి రాలేదు, ఇది పంజాబ్ కు కీలకంగా మారనుంది.
కోల్ కత్తాతో జరిగిన గత మ్యాచ్ లో గుజరాత్ జట్టు చేజేతులా ఓడిన సంగతి తెలిసిందే. అయితే అంత మాత్రం గుజరాత్ టీమ్ ను తక్కువగా అంచనా వేయలేం. జట్టులో సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ లు అద్భుతంగా రాణిస్తున్నారు. వీరికి తోడు పాండ్యా, శుభ్ మన్ గిల్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ లు ఉండనే ఉన్నారు. ఇక బౌలింగ్ లో మహ్మద్ షమీ, జోషువా లిటిల్, జోషఫ్, యష్ దయాళ్ లు పరిస్థితులకు తగ్గట్లుగా రాణిస్తున్నారు. ఇక ఇరు జట్లు పటిష్టంగా ఉన్నప్పటికీ విజయావకాశాలు ఎక్కువగా గుజరాత్ వైపే మెుగ్గుచూపుతున్నాయి.
శిఖర్ ధావన్, జితేశ్ శర్మ, ప్రభ్ మన్ సింగ్, సామ్ కర్రన్, షారుఖ్ ఖాన్, లివింగ్ స్టోన్/ భానుక రాజపక్స, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్/ రబాడ, అర్ష్ దీప్ సింగ్,
శుభ్ మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్, పాండ్యా, విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, షమీ, అల్జారీ జోషెఫ్, జోషువా లిటిల్.