రేపు ఉప్పల్ వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుకు అంతా సిద్ధమైంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈవ్ టీజర్ల భరతం పట్టడం మొదలు.. బీటింగ్ రాయుళ్ల పసిగట్టడం వరకు అన్ని ఏర్పాట్లు చేశారు. కావున ముందుగా ఈ విషయాలు తెలుసుకొని మ్యాచుకు బయలుదేరండి.
దేశంలో ఐపీఎల్-2023 సందడి మొదలైన సంగతి అందరకీ విధితమే. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనుండగా, ఉప్పల్ వేదికగా 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 2న ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుండగా.. మే 18న చివరి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే పోలీసు అధికారులు ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. స్టేడియం లోపల, వెలుపల మొత్తం 340 సీపీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.
రేపటి మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలించారు. ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..’ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. 1500 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. స్టేడియం లోపల, వెలుపల మొత్తం 340 సీపీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జాయింట్ కమాండ్, కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాడానికి క్విక్ రియాక్షన్ టీమ్స్ అందుబాటులో ఉంచుతున్నట్టుగా తెలిపారు.
ఇక మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే యువతులు, మహిళలు ఈవ్ టీజింగ్‌కు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. షీ టీమ్స్ ద్వారా ఈవ్ టీజర్లపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక డే మ్యాచ్‌ల కోసం స్టేడియం గేట్లు మ్యాచ్‌కు మూడు గంటల ముందు తెరవబడతాయని.. రాత్రి మ్యాచ్‌లకు సాయంత్రం 4.30 గంటలకు ఓపెన్ చేస్తారని ఆయన మీడియాకు వెల్లడించారు. అలాగే కొన్ని వస్తువులను స్టేడియం లోపలకి తీసుకెళ్లడంపై పోలీసులు ఆంక్షలు ప్రకటించారు. కవుల మ్యాచుకు వెళ్లేవారు ఈ వస్తువులను తీసుకెళ్లకపోవడం మంచిది.
ల్యాప్‌టాప్స్, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, మ్యాచ్ బాక్స్, లైటర్స్, పదునైన ఆయుధాలు, ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యూలర్స్, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్స్, పర్‌ఫ్యూమ్స్, బ్యాగ్స్, తినుబండారాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
The #TATAIPL2023 matches are to be held from 02-4-2023 to 18-5-2023 at #RGI Cricket Stadium Uppal.For the #safety & #security of players & Spectators,elaborate #bandobast arrangements are being made in coordination with different wings of about 1500 staff deployed for #bandobast. pic.twitter.com/GdJgKh8SVQ
— Rachakonda Police (@RachakondaCop) April 1, 2023