చెన్నై vs లక్నో మ్యాచ్ చూడటానికి ఊహించని అతిథి హాజరైంది. ఎవరా అతిథి అనుకోకండి.. కుక్క. మ్యాచ్ చూడటానికి ఓ కుక్క స్టేడియంలోకి వచ్చింది. అలా వచ్చింది ఏం చేయాలి.. ఏదో మూలన కూర్చొని కామ్ గా మ్యాచ్ చూడాలి. కానీ, అలా చేయలేదు. స్టేడియం అంతా తనదే అన్నట్టు ఉన్నట్టుండి మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఏం జరిగిందో చూడండి..
ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతోందంటే ఇరు జట్ల అభిమానులు, బెట్టింగ్ రాయుళ్లు ఎంత ఆతృతగా ఎదురుచూస్తారో అందరకీ విదితమే. తమ అభిమాన జట్టే గెలవాలని అభిమానులు, తాము పందెం కాసిన జట్టే గెలవాలని బెట్టింగ్ రాయుళ్లు కోరుకుంటారు. అందుకోసం అరగంట ముందుగానే టీవీలకు అతుక్కుపోయి వేయి కళ్ళతో ఎదురుచూస్తారు. అలాంటి వారందరికీ ఓ కుక్క ఊహించని షాకిచ్చింది. దీని దెబ్బకు మ్యాచ్ ఆగిపోవడం పక్కనపెడితే.. ఆటగాళ్లు ఆ కుక్క వెంట పరుగులు పెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్.. లక్నో జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది.
తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. తమ సొంత గ్రౌండ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన లక్నో సారథి కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకోగా.. చెన్నై బ్యాటర్లు మైదానంలోకి అడుగుపెట్టారు. ఇక బాల్ పడుతుందనంగా అనుకోని అతిథి ఎంట్రీ ఇచ్చింది. సెక్యూరిటీ కళ్ళు గప్పి మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన కుక్క అందరిని పరుగులు పెట్టించింది. ఆ కుక్కతో లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ ఆడుకోవటం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Dog interrupted the game for a while at Chepauk. #cskvlsg #CSKvsLSG pic.twitter.com/CiAbmQopII
— rajendra tikyani (@Rspt1503) April 3, 2023
#Chepauk #dogs ❤️ #CSKvsLSG #LSGvsCSK #CSK #LSG #IPL2023 #TATAIPL #ChennaiSuperKings #Chennai #RuturajGaikwad #Conway #MSDhoni𓃵 #MSDhoni #dhonisenahimangnachahiyetha #Dhoni #starsportstamil #StarSportsTamilHD #KLRahul𓃵 #WhistlepoduArmy #Yellove pic.twitter.com/IazouCm7L3
— Yoganantham Shankar (@immortal_yoga) April 3, 2023
Look who wants to come on as an Impact Player… 😂
A dog delays start at Chepauk. Even as the groundsmen try in vain to get it out, Avesh Khan joins the fun. The audience is loving every bit of this. #CSKvLSG #IPL2023 @sportstarweb pic.twitter.com/Egv2s36QWn
— Santadeep Dey (@SantadeepDey) April 3, 2023