DC vs KKR Prediction: ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఢిల్లీ క్యాపిటల్స్.. కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు మూడో విజయం కోసం కేకేఆర్ ఎదురుచూస్తోంది. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటే?
ఐపీఎల్ 2023లో అన్ని మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. చివరి బాల్ వరకు ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టంగా మారింది. అంత టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ క్రమంలో కోల్‌కత్తా నైట్‌రైజర్స్‌తో ఢిలీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో కేకేఆర్ సంచలన విజయాలు నమోదు చేస్తే.. ఢిల్లీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో మరి ఈ మ్యాచ్‌తో అయినా ఢిల్లీ తలరాత మారుతుందో లేదో చూడాలి. అయితే.. ఏ టీమ్ బలం, బలహీనతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూదం..
కోల్‌కత్తా నైట్‌రైడర్స్..
యువ క్రికెటర్లపై ఎక్కువగా ఆధారపడుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు సీనియర్ల వైఫల్యం దారుణంగా దెబ్బకొడుతుంది. ప్రస్తుతం జట్టులో ఉన్న వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింత్ మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే.. భారీ అంచనాలు ఉన్న ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ దారుణంగా విఫలం అవుతున్నాడు. అలాగే ఓపెనింగ్ సమస్య కూడా కేకేఆర్‌ను వేధిస్తోంది. కేకేఆర్ బౌలింగ్ పేపర్‌పై పటిష్టంగా ఉన్నా.. ధారళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్..
ఈ మ్యాచ్‌లో ఢిలీ జట్టు భారీ మార్పులతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాగైనా కోల్‌కత్తాపై గెలిచి ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసి టోర్నీలో కమ్‌బ్యాక్ చేయాలని చూస్తోంది. అయితే వార్నర్ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడం ఢిల్లీకి పెద్ద సమస్యగా మారింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో కంటే బౌలింగ్‌లోనే పటిష్టంగా ఉందని చెప్పుకోవాలి. అయితే.. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ స్థాయి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. పేస్ బౌలింగ్‌లో అనిచ్ర్ నోర్జే, ముస్తఫీజుర్ ఢిల్లీకి ప్లేస్ పాయింట్‌గా మారారు.
తుది జట్ల అంచనా..
KKR: జాసన్ రాయ్, జగదీషన్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్థుల్ ఠాకూర్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, లూకీ ఫెర్గూసన్, వరున్ చక్రవర్తి, సుయాష్ శర్మ.
DC: పృథ్వీషా, వార్నర్, మిచెల్ మార్ష్, యాష్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అభిషేన్ పొరెల్, లలీత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నూర్జే, ముస్తఫీజుర్ రెహమాన్.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Watson’s & Ponting’s kids got special assistance 👉 Coach Shardul! 😜✅@imShard | @RickyPonting | @ShaneRWatson33 | #AmiKKR | #TATAIPL 2023 pic.twitter.com/fItSSgT8vc
— KolkataKnightRiders (@KKRiders) April 20, 2023