తమ అభిమాన జట్టును, క్రికెటర్‌ని ఉత్సాహ పరిచేందుకు అభిమానులు పోడియంలో కూర్చొని ఈలలు, కేకలు వేయటం సహజం. కానీ ఈ అభిమాని అందుకు విభిన్నం. తనదైన డ్యాన్స్‌తో చీర్ గర్ల్స్‌నే తనవైపు తిప్పుకున్నాడు.
ఎప్పటిలానే ఐపీఎల్ – 2023 సీజన్ హోరాహోరీగా సాగుతోంది. లీగ్ దశలో 61 మ్యాచులు ముగిసినా, ఇప్పటివరకు అధికారికంగా ఒక్క జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. వరుస విజయాలతో దూకుడు మీదున్న గుజరాత్ అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందనుకుంటే, గత మ్యాచులో అనూహ్యంగా ముంబై చేతిలో మట్టికరిచింది. ఇక భారత మాజీ సారథి, కెప్టెన్ కూల్ సారథ్యంలోని చెన్నైకి అదే అవకాశం ఉన్నా, ఆదివారం రాత్రి జరిగిన మ్యాచులో కోల్‌కతా చేతిలో ఓటమి పాలైంది. దీంతో ప్లేఆఫ్స్ చేరే నాలుగు జట్లేవి అన్నది అంతుపట్టడం లేదు. వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మినహాయిస్తే అన్ని జట్లకు అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ ప్రాంచైజీ సన్ రైజర్స్ జట్టుకు కూడా ఇంకా అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి.
ఇదిలావుంటే ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచులో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సొంత మైదానం కావడంతో సీఎస్‌కే అభిమానులు డ్యాన్సులు, అరుపుల కేకలతో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశారు. ఒక అభిమాని అయితే.. చీర్ గర్ల్స్‌కే డ్యాన్స్ నేర్పించాడు. అతను డ్యాన్స్ చూసి మంత్రముగ్ధులైన చీర్ గర్ల్స్ అతన్ని అనుకరిస్తూ డ్యాన్స్ వేయటం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతని డ్యాన్స్‌కి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. ‘చెన్నై అభిమాని అనిపించుకున్నావ్..’ అంటూ అతనిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కాగా, సొంతగడ్డపై విజయం సాధించి ప్లేఆప్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలనుకున్న చెన్నైకి పరాజయం ఎదురైంది. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా, కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్ సారథి నితీశ్ రాణా (57 నాటౌట్), రింకూ సింగ్ (54) అర్ధశతకాలు బాది జట్టును విజయతీరాలకు చేర్చారు.
IPL 2023 Playoffs chances:
GT – 98%.
CSK – 90%.
MI – 80%.
LSG – 61%.RCB – 31%.
PBKS – 21%.
RR – 11%.
KKR – 6%.
SRH – 2%.
DC – 0%.#ipl2023pointstable #IPL #IPL2O23— Indian cricket news (@Pvishnoi5) May 15, 2023