IPL 2023: అన్ని జట్లు ఏడేసి మ్యాచ్‌లు ముగించుకున్నాయి. ఇక మరో సారి ఒకరితొ ఒకరు తలపడనున్నారు. సగం సీజన్ పూర్తి అయిన తర్వాత.. ఎవరి స్థానం ఏంటి? ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ 2023లో మంగళవారంతో సగం మ్యాచ్‌లు ముగిశాయి. బుధవారం నుంచి జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. సీజన్ మొదలైన వారం రోజులు మ్యాచ్‌లు దాదాపు ఏకపక్షంగానే జరిగాయి. రెండో వారం నుంచి అసలు సిసలైన ఐపీఎల్ మజాను అందిస్తూ.. క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ వినోదాన్ని పంచాయి. దాదాపు ప్రతి మ్యాచ్ చివరి బాల్ వరకు వెళ్తూ.. హైటెన్షన్ మ్యాచ్‌లు జరిగాయి. అయితే ప్రస్తుతం ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. అన్ని జట్లు తలో 7 మ్యాచ్‌లు ఆడేశాయి. దీంతో సగం సీజన్ పూర్తి అయింది. మరి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ఏఏ జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే..
ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అంచనాలకు మించి రాణిస్తోంది. ప్రస్తుతం ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. ఆ తర్వాత పుంజుకుని ప్రస్తుతం ప్రత్యర్థి జట్లను వణికిస్తోంది. ఇక రెండో స్థానంలో గుజరాత్ టైటాన్స్ సైతం 5 విజయాలతో ఉంది. మూడో స్థానంలో 4 విజయాలతో రాజస్థాన్ రాయల్స్, 4వ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ కూడా 4 విజయాలతో ఉంది. ఈ నాలుగు జట్లకు ఫ్లే ఆఫ్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
5, 6, 7 స్థానాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వరుసగా ఉన్నాయి. ప్రస్తుతానికి పై నాలుగు జట్లతో పాటు ఈ మూడు టీమ్స్‌కు కూడా ప్లే ఆఫ్ అవకాశాలు బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం వీరి ప్రదర్శన ఆధారంగా చూస్తే.. ఆర్సీబీ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేలా ఉంది. ఇక పంజాబ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పడం కష్టం. ముంబై కొలుకున్నట్లే కొలుకుని.. మళ్లీ ఓటమి బాట పట్టింది.
ఇక చివరి మూడు స్థానంల్లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. ఈ మూడు జట్లకు కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదని చెప్పలేం కానీ, చాలా సంక్లిష్టంగా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 రెండు విజయాలతో ఈ మూడు టీమ్స్ ఉన్నాయి. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడితే.. ఇంటి దారి పట్టేస్తాయి. కానీ, ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ గెలిస్తే మాత్రం.. వీటికి కూడా ప్లే ఆఫ్స్ ఛాన్సులు ఉన్నాయి. కానీ, అది అంత సులువైన విషయం కాదు. మరి ఈ ఐపీఎల్ సీజన్‌లో ఏ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుతాయని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
IPL 2023 Points Table:
– CSK and GT with 10 Points.
– 4 teams with 8 Points.
– MI with 6 Points.
– 3 teams with 4 Points.– The first half of 2023 is successfully completed! pic.twitter.com/tWy4uxYxMK
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2023