గత కొన్ని రోజులుగా కేకేఆర్ బ్యాటింగ్ సంచలనం రింకు సింగ్ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ ఈ యంగ్ ప్లేయర్ కి ఒక బంపరాఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి ?
గత కొన్ని రోజులుగా కేకేఆర్ బ్యాటింగ్ సంచలనం రింకు సింగ్ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. జట్టు విజయానికి చివరి 5 బంతుల్లో 29 పరుగులు అవసరమైన దశలో వరుసగా 5 సిక్సర్లు కొట్టి కేకేఆర్ కి ఎప్పటికీ మర్చిపోలేని విజయానందించాడు. ఇక ఆ తర్వాత పేద క్రికెటర్లకు ఒక క్రికెట్ స్కూల్ నడుపుతూ 50 లక్షలు విరాళంగా ఇచ్చి తన గొప్ప తనాన్ని చాటుకున్నాడు. ఇక తాజాగా కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ ఈ యంగ్ ప్లేయర్ కి ఒక బంపరాఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి ?
బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియం లో ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ అనంతరం షారుఖ్ తనకొక బంపరాఫర్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. రింకు సింగ్ మాట్లాడుతూ”మ్యాచ్ అనంతరం షారుఖ్ నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించాడు. ఈ క్రమంలో నా పెళ్లి గురించి మాట్లాడిన షారుఖ్.. నన్ను ఇప్పటివరకు చాలామంది పెళ్లిళ్లకు ఆహ్వానించారు. కానీ నేను వెళ్ళలేదు. నీ పెళ్ళికి ఖచ్చితంగా వచ్చి డ్యాన్స్ చేస్తాను అని షారుఖ్ చెప్పాడట. బాగా కావాల్సిన లేదా ప్రముఖుల ఫంక్షన్లకు వెళ్లే షారుఖ్ ఇలా అడగకుండానే తన పెళ్ళికి వస్తానని చెప్పడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు ఈ కేకేఆర్ బ్యాటర్. సోషల్ మీడియా వేదికగా రింకు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ఇక రింకు సూపర్ బ్యాటింగ్ తర్వాత షారుఖ్ కూడా సంతోషం వ్యక్తం చేసాడు. తన ట్విట్టర్ ఖాతాలో పఠాన్ సినిమాలో ఉన్న తన ముఖాన్ని తీసేసి ఆ స్థానంలో రింకు ముఖాన్ని అతికించి షేర్ చేసాడు. కేకేఆర్ జట్టులో ప్రస్తుతం రింకు సింగ్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచుల్లో 251 పరుగులు చేసిన రింకు స్ట్రైక్ రేట్ 158 గా ఉంది. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.ఐపీఎల్ భాగంగా ఈ రోజు గుజార్త్ టైటాన్స్ తో మరోసారి కేకేఆర్ తలపడుతుంది. మరి ఈ మ్యాచులో రింకు సింగ్ ఎలా చెలరేగుతాడో చూడాలి. మొత్తానికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఇలా రింకుకి అడగకుండానే ఆఫర్ ఇవ్వడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
When SRK Called Rinku Singh!#ShahRukhKhan𓀠 #RinkuSingh pic.twitter.com/rC2Ki7eHwl
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) April 27, 2023