ఐపీఎల్ సీజన్ 16 లో ఛాంపియన్ జట్లు సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు రెండూ కూడా ప్రస్తుతం టైటిల్ ఫేవరేట్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై మాజీ ప్లేయర్, ప్రస్తుతం బౌలింగ్ కోచ్ డ్వైన్ బ్రావో ఒక విషయంలో బయపడుతున్నాడు.
ఐపీఎల్ సీజన్ 16 లో ఛాంపియన్ జట్లు సత్తా చాటుతున్నాడు. ఇదివరకు టైటిల్ గెలవని జట్లకు అవకాశం ఇవ్వకుండా మరో టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుతం టైటిల్ రేస్ లో మూడు జట్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఐపీఎల్ లోనే సక్సెస్ ఫుల్ గా ఉన్న జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అయితే.. మరొక టీం డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్. ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్ ఈ మూడు జట్లలో ఏదో ఒక టీంకి వెళ్లబోతుంది. అయితే ఇప్పటికే క్వాలిఫయర్ 1లో గుజరాత్ మీద గెలిచి చెన్నై ఫైనల్ కి వెళ్లగా మరో ఫైనల్ బెర్త్ కోసం ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్ 2 ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై మాజీ ప్లేయర్, ప్రస్తుతం బౌలింగ్ కోచ్ డ్వైన్ బ్రావో ఒక విషయంలో బయపడుతున్నాడు.
ఐపీఎల్ లో విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ముందు వరుసలో ఉంటాయి. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 5 ఐపీఎల్ టైటిళ్లు సాధిస్తే.. చెన్నై 4 గెలిచింది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ రికార్డ్ చూస్తే చెన్నై మీద ముంబైకి పూర్తి ఆధిపత్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 4 సార్లు ఐపీఎల్ ఫైనల్స్‌లో తలపడగా.. అందులో ముంబై ఇండియన్స్ జట్టు 3 సార్లు గెలుపొందగా.. చెన్నై జట్టు ఒక్కసారి మాత్రమే మ్యాచ్ గెలిచింది. చెన్నై గెలిచిన ఆ ఒక్క ఫైనల్ 2010లో కావడం గమనార్హం. ఇక ఆ తర్వాత ఈ రెండు జట్లు మూడు ఫైనల్స్ లో తలపడగా మూడు సార్లు ముంబైని విజయం వరించింది.
ముంబై 2013, 2015, 2019 ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌తో ఫైనల్ ఆడితే తమకు అందే ట్రోఫీ కూడా చేజారుతుందేమోనని బ్రావో భావిస్తున్నాడు. బ్రావో మాట్లాడుతూ ” ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడడం నాకు ఇష్టం లేదు. నా స్నేహితుడు కీరన్ పొలార్డ్‌కి కూడా దాని గురించి తెలుసు. కానీ అన్ని టీమ్‌లకు నా నుంచి ఆల్ ది బెస్ట్. ఫైనల్‌లోకి ఎవరు నిలుస్తారు..? అదే మా ఫోకస్’ అని అన్నాడు. మొత్తానికి పాత రికార్డ్ చూసి బ్రావో బయపడుతున్నట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి బ్రావో చేసిన ఏ వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.