Mumbai Indians: టీమ్ ఎంత బలంగా ఉన్నా.. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయే జట్టు ఏదంటే ప్రతి క్రికెట్ అభిమాని చెప్పే మాట ముంబై ఇండియన్స్. ఈ ఐపీఎల్ సీజన్‌లోనూ అదే నిజమైంది. ఆర్సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై దారుణంగా ఓడింది. వారి సెంటిమెంట్ వెనుక బెట్టింగ్ ఉన్నట్లు సమాచారం.
ముంబై ఇండియన్స్.. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు. ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన ఏకైక టీమ్. ప్రతి సీజన్‌లో ముంబై అంటే టైటిల్ ఫేవరేట్, ఒక బలమైన జట్టు. కానీ, సీజన్ తొలి మ్యాచ్‌లో మాత్రం ఓడిపోతుంది. ప్రతర్థి ఎవరైనా.. జట్టు ఎంత బలంగా ఉన్నా.. ఫస్ట్ మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడం గ్యారంటీగా మారిపోయింది. ఈ పరంపర ఈ మధ్య కాలం నుంచి కాదు.. 2013 నుంచి ఇదే తంతు. 2013, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23.. ఇలా వరుసగా 11 ఏళ్లు తొలి మ్యాచ్‌లో ముంబై ఓడిపోతూ వస్తుంది. సగటు క్రికెట్ అభిమాని మనసులో బలంగా నాటుకొపోయిన మాట తొలి మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడం పక్కా. ‘ముంబై ఫస్ట్ మ్యాచ్‌ను దేవుడికి ఇచ్చేస్తోంది’ అనే జోకులు కూడా పేలుతుంటాయి. ముంబై తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడితే.. ఆ ఏడాది కప్పు కొడుతుందని కూడా చాలా మంది నమ్ముతుంటారు. కానీ.. గతేడాది రెండు కాదు వరుసగా 8 ఓడి.. అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది.
మళ్లీ ఈ ఏడాదిని కూడా ఓటమితోనే మొదలు పెట్టింది. చూసేందుకు తొలి మ్యాచ్ ఓడిపోవడం ముంబైకి సాంప్రదాయంలా కనిపిస్తున్నా.. దీని వెనుక మాత్రం భారీ స్థాయిలో బెట్టింగ్ నడుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ వేసే వాళ్లు.. ముంబై సెంటిమెంట్‌పై పూర్తి నమ్మకంతో ఈ సారి కూడా ముంబై ఎంత బలంగా ఉన్నా.. ఆర్సీబీ గెలుస్తుందని బెట్టింగ్‌లు వేశారు. ఈ సెంటిమెంట్‌ను పట్టించుకోని వారు.. ఎనాలసిస్‌లు, జట్టు బలాబలాలు అంచనా వేసి మరీ.. ముంబై గెలుస్తుందని బెట్టింగ్‌లు వేసి.. దారుణంగా దెబ్బతిన్నట్లు సమాచారం. తొలి మ్యాచ్‌లో ఓడిపోయే ముంబై అలవాటుతో అనైతికంగా ఆదివారం చాలా డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోంది.
ముంబై విషయంలో ఇదంతా యాదృశ్చికంగా జరుగుతున్నా.. దాదాపు 11 ఏళ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతుండటంతో.. ముంబై తొలి మ్యాచ్‌లపై కొంతమంది క్రికెట్ అభిమానులు అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ముంబై కావాలనే తొలి మ్యాచ్‌లో ఓడిపోతుందా? అంటూ సోషల్ మీడియా వేదికగా సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ.. ఐపీఎల్‌ను చాలా పగడ్బంధీగా నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ చాలా సార్లు ప్రకటించింది. కానీ.. ముంబై సెంటిమెంట్ మాత్రం అనైతికంగా కొన్ని కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌కు ముందు భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. ఈ బెట్టింగ్‌పై ముంబై ఫస్ట్ మ్యాచ్ సెంటిమెంట్ తీవ్ర ప్రభావం చూపింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Not the start we wanted! 😔
We’ll be back stronger 👊#OneFamily #RCBvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL pic.twitter.com/W81jynqxG0
— Mumbai Indians (@mipaltan) April 2, 2023