ఐపీఎల్ లో దీపక్ హుడా పేలవ ఫామ్ కొనసాగుతుంది. ఎప్పటిలాగే తన చెత్త ఫాన్ ని కొనసాగించి కేవలం 5 పరుగులు మాత్రమే చేసాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డ్ ని నెలకొల్పాడు.
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం లక్నో సూపర్ జయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.లక్నోలోని అటల్ బిహారీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేస్తోన్న లక్నో టీం ఇన్నింగ్స్ నిలకడగా కొనసాగుతుంది. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లక్నో జట్టుని కెప్టెన్ క్రునాల్ పాండ్య, అల్ రౌండర్ స్తోయినీస్ ఆదుకుంటున్నారు. ఆరంభంలో ముంబై బౌలర్ విజ్రంభించి వరుసగా రెండు వికెట్లు తీసాడు. దీపక్ హుడా ఎప్పటిలాగే తన చెత్త ఫాన్ ని కొనసాగించి కేవలం 5 పరుగులు మాత్రమే చేసాడు. ఈ క్రమంలో ఒక చెత్త రికార్డ్ ని నెలకొల్పాడు.
దీపక్ హుడా చాలా టాలెంటెడ్ క్రికెటర్ అని అందరికీ తెలిసిందే. ఐపీఎల్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో కారణంగానే భారత జట్టులోకి వచ్చాడు. ఇంటర్నేషనల్ కెరీర్ లో ఒక సెంచరీని కూడా నెలకొల్పాడు. అయితే ప్రస్తుతం ఈ లక్నో బ్యాటర్ ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. ఇదే కారణంతో జట్టులో స్థానం కోల్పోయిన హుడా.. ఈ రోజు జరుగుతున్న కీలక మ్యాచులో మళ్ళీ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ గా వచ్చిన హుడా.. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. చివరి 10 ఇన్నింగ్స్ లు తీసుకుంటే హుడా అత్యధిక స్కోర్ కేవలం 17 మాత్రమే.
వీటిలో మూడు సార్లు మినహాయించి మిగిలినవన్నీ సింగల్ డిజిట్ లే కావడం విశేషం. ఈ క్రమంలో ఐపీఎల్ లోనే తన పేరిట అత్యంత చెత్త రికార్డ్ నమోదు చేసుకున్నాడు. ఒక ప్లేయర్ ఒక సీజన్ లో కనీసం 10 ఇన్నింగ్స్ లు ఆడి 6.90 యావరేజ్ నమోదు చేసాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ పూరన్ పేరిట ఉంది. పూరన్ 2021 లో 7.73 యావరేజ్ మాత్రమే ఉంది. తాజాగా ఈ రికార్డుని పూరం బద్దలు కొట్టాడు. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచులో హుడా ఇలా ఆడడం జట్టు మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరి హుడా చెత్త రికార్డ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.