Harry Brook: ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.13.25 కోట్లు పెట్టి కొంటే.. అతని ఆటకు అది చాలా తక్కువ అని అన్నారు. ఇప్పుడు అతని ఆట నుంచి అన్ని పైసలు దండగా అంటున్నారు. అయితే.. బ్రూక్ విషయంలో సన్‌రైజర్స్ మోసపోయేందుకు ప్రధాన కారణం పాకిస్థాన్ అనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. అదేంటంటే..
ఐపీఎల్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక స్టార్ బ్యాటర్ ఉన్నాడు. అతనొక్కడు ఆడితే చాలు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే అని అంతా భావించారు. అందుకే అతన్ని రూ.13.25 కోట్ల భారీ ధర పెట్టి సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది.. లేకుంటే అంత డబ్బు ఎందుకు పెడతారంటూ ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ సైతం ఖుషీ అయ్యారు. అంత హైప్ అందుకున్న క్రికెటర్ హ్యారీ బ్రూక్. ఇంగ్లండ్‌కు చెందిన ఈ యువ క్రికెటర్.. టెస్టుల్లో ఒక సంచలనంగా మారాడు. ఆడిందే ఆరు టెస్టు మ్యాచ్‌లే అయినా.. 80.90 సగటుతో 809 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ ట్రాక్ రికార్డు చూస్తే.. హ్యారీ బ్రూక్ ఎలాంటి ప్లేయరో అర్థమవుతోంది. ఈ రికార్డులు చూసే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ హ్యారీ బ్రూక్‌పై వేలంలో కోట్లు కుమ్మరించారు. కానీ, తీరా ఐపీఎల్ మొదలై రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత బ్రూక్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ బ్రూక్ దారుణంగా విఫలం అవ్వడంతో అతనికి పెట్టిన డబ్బు దండగా అనే పరిస్థితి తలత్తెంది. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్ బ్రూక్‌ను చాలా ఎక్కువగా అంచనా వేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్రూక్‌పై ఎక్కువగా అంచనాలు పెట్టుకుని కావ్య మారన్ మోసపోయిందని.. అందుకు పాకిస్థాన్ ప్రధాన కారణమంటూ కొత్త వాదన వినిపిస్తోంది. అది ఎలాగంటే..
బ్రూక్ ఇప్పటి వరకు ఆడిన 6 టెస్టుల్లో మూడు టెస్టులు పాకిస్థాన్‌లోనూ ఆడాడు. మూడు టెస్టుల్లో మూడు సెంచరీలు కూడా బాదాడు. రావాల్పిండి, ముల్తాన్, కరాచీల్లో ఈ టెస్టులు జరిగాయి. మిగిలన మూడు టెస్టులను ఒక ఇంగ్లండ్‌లో, రెండు న్యూజిలాండ్‌లో ఆడాడు. అయితే.. పాకిస్థాన్‌లో చూపించినంత ప్రభావం మిగతా వేదికల్లో చూపలేదు. అలాగే పాకిస్థాన్‌లో జరిగే పీఎస్‌ఎల్‌లోనూ బ్రూక్ మంచి ప్రదర్శన కనబర్చాడు. కానీ.. ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి మాత్రం దారుణంగా నిరాశపరుస్తున్నాడు. పాకిస్థాన్‌లోని ఫ్లాట్ పిచ్‌లపై పులిలా చెలరేగిన బ్రూక్.. భారత్ పిచ్‌లపై మాత్రం పిల్లిలా మారిపోతున్నాడు. పాకిస్థాన్ ఫ్లాట్ పిచ్‌లను పట్టించుకోకుండా.. బ్రూక్ బ్యాటింగ్ చూసి సన్‌రైజర్స్ యాజమాన్యం మోసపోయిందని, ఇందతా జీవం లేని పాకిస్థాన్ నాసిరకం పిచ్‌ల వల్లే జరిగిందంటూ కొంతమంది క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో తెలియజేయండి.
Dear Harry Brook,
This isn’t flat PSL pitches. These are challenging Indian wickets.
Welcome to the IPL 🥳💗 pic.twitter.com/frehIPfjvc
— Abhisar Tiwari (@TiwariAbhisar27) April 7, 2023