రూ.13 కోట్ల ప్లేయర్, ఐపీఎల్ లో ఫస్ట్ సెంచరీ చేశాడు. సన్ రైజర్స్ ని గెలిపించాడు. గత మూడు మ్యాచ్ ల్లో జిడ్డు బ్యాటింగ్ చేసిన ఇతడు.. ఇప్పుడు సడన్ గా 100 కొట్టడానికి రీజన్ ఏంటో తెలుసా?
ఐపీఎల్ కోట్లు పెట్టి కొన్న ప్లేయర్స్ దారుణంగా అంటే దారుణంగా ఫెయిలవుతున్నారు. అనామక, చాలా తక్కువ ధరకే అమ్ముడుపోయిన క్రికెటర్లు ఏమో అద్భుతంగా ఆడుతున్నారు. ఈ సీజన్ లో చాలావరకు అలానే జరుగుతోంది. మిగతా వాళ్ల గురించి కాస్త పక్కనబెడితే.. సన్ రైజర్స్ ఏకంగా రూ.13 కోట్లు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్.. గత మూడు మ్యాచ్ లో చెత్త ఆటతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడేమో ఏకంగా సెంచరీ బాది శెభాష్ అనిపించుకున్నాడు. అదేంటి ఇన్నాల్లు జిడ్డు బ్యాటింగ్ చేసి, ఇప్పుడేంటి సడన్ గా ఇలా మారిపోయాడు అని మీకేమైనా డౌట్ వచ్చిందా? దానికి కారణమేంటనేది ఇప్పుడు తెలిసిపోయింది.
అసలు విషయానికొస్తే.. ఏ గేమ్ తీసుకున్నా సరే జట్టులోని ప్లేయర్ పై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఐపీఎల్ లాంటి టోర్నీలో అయితే బౌలర్ కి అయితే వేస్తున్న ప్రతి బంతి, బ్యాటర్ కి అయితే ఆడుతున్న ప్రతి బాల్ లెక్కలోకి వస్తుంది. అలా ఈసారి ఎలాగైనా సరే కప్ కొట్టాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్.. ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ని ఏకంగా రూ.13 కోట్లు కొనుగోలు చేసింది. కానీ మనోడేమో రాజస్థాన్ పై 13, లక్నోపై 3, పంజాబ్ పై 13 రన్స్ కొట్టి నిరాశపరుస్తూ వచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఘోరంగా ట్రోల్ చేశారు. తాజాగా కోల్ కతాతో మ్యాచ్ లో రెచ్చిపోయాడు.
కేకేఆర్ తో మ్యాచ్ లో 55 బంతుల్లో 100 కొట్టిన హ్యారీ బ్రూక్.. ఈ సీజన్ లో సన్ రైజర్స్ రెండు విజయానికి కారణమయ్యాడు. తన ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘నేను ఐపీఎల్ ఆడుతున్నానని తెలిసి ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చారు. కొన్ని కారణాల వల్ల వారు వెళ్లిపోయారు. నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే ఇక్కడి ఉంది. నా ఇన్నింగ్స్ ని బాగా ఎంజాయ్ చేసింది. ఈరోజు నా ఫెర్ఫార్మెన్స్ పై ఫ్యామిలీ హ్యాపీగా ఉందని అనుకుంటున్నాను’ అని అన్నాడు. దీన్నిబట్టి చూస్తే.. మనలో చాలామందిలానే హ్యారీ బ్రూక్ పైనా ఫ్యామిలీ ప్రెజర్ ఉన్నట్లుంది. వాళ్లు అలా వెళ్లిపోయారో లేదో సెంచరీ కొట్టేశాడు. సో అదన్నమాట విషయం.. బ్రూక్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే ఫ్యామిలీ స్టేడియంలో ఉంటే బ్యాటింగ్ సరిగా చేయలేడనమాట. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Harry Brook said, “my girlfriend is here, but the rest of the family just left. I knew this would happen as soon as they left I’ll get some runs (laughs)”. pic.twitter.com/TJatdittlh
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2023
We have the next-gen superstar in Brook. Hopefully, he will be here for a decade.
Third batsman to score a 💯 for #SRH after Warner and Bairstow.
— Gappa Cricket (@GappaCricket) April 14, 2023