ఆటలో రాణించినా అతి విస్వాసం ఉంటే అంతా పోతుంది. దూకుడుగా ఉండాలి అని ప్రత్యర్థి ఆటగాళ్లపై దూసుకెళ్తే తగిన మూల్యం చెల్లించుకోవాలి. ఆటతో పాటు మంచి వ్యక్తిత్వం ఉన్నప్పుడే అత్యున్నత స్థాయికి రాగలరు. ఇదంతా ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య గురించి చెబుతున్న మాటలు. అసలు హార్దిక్ ఏం చేసాడంటే ?
ఐపీఎల్ 2023 లో గుజరాత్ టైటాన్స్ టీమ్ తడబడుతుంది. మొదటి మ్యాచ్ గెలిచిన తర్వాత ఇక హార్దిక్ సేనకు తిరుగుండదు అని భావించారు. కానీ ఆ తర్వాత టైటాన్స్ జట్టు పడుతూ లేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. తాజాగా నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గెలుపు ఖాయమనుకుంటున్న దశలో ఓడిపోయింది. సంజు శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో చెలరేగడం వలెనే రాజస్థాన్ ఇన్నింగ్స్ ముందుకు సాగింది. అయితే శాంసన్ ఇంతలా చెలరేగి ఆడడానికి కారణమేంటి అని ఆరా తీస్తే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఓవర్ యాక్షన్ అని తెలుస్తుంది. అసలు హార్దిక్ పాండ్య ఈ ఓటమిలో ఎందుకు భాగమయ్యాడు ?
ఆట ఎంత బాగా ఆడినా.. వ్యక్తిగత ప్రవర్తన చాలా ముఖ్యం. కెప్టెన్ స్థాయిలో జట్టును లీడ్ చేస్తున్నప్పుడు ఎంతో హుందాగా నడుచుకోవాలి. కానీ హార్దిక్ పాండ్యలో అది కనిపించడం లేదు. నిన్న జరిగిన మ్యాచ్ లో బ్యాట్ తో మెరిసినా, బౌలింగ్ లో రాణించినా .. కేవలం తన ఆటిట్యూడ్ వలనే మ్యాచ్ ని కోల్పోవాల్సి వచ్చిందనే మాట వాస్తవం. మ్యాచ్ గెలిచే అవకాశం ఉన్నప్పుడు బౌలింగ్ మీద దృష్టి పెట్టాలి కానీ ఇలా ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్విస్తే ఏం లాభం? అందుకే రాజస్థాన్ బ్యాటర్ సంజు శాంసన్ మీదకు స్లెడ్జింగుకి దిగి తగిన మూల్యం చెల్లించుకున్నాడు.
ఈ మ్యాచ్ లో భాగంగా తొలి 10 ఓవర్లలో 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ జట్టు. కొట్టాల్సిన రన్ రేట్ దాదాపు 13 ఉండడంతో విజయం సాధించడం చాలా కష్టంగా మారింది. అయితే ఇక ఎలాగో గెలిచేస్తాం అని భావించిన హార్దిక్ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ శాంసన్ మీద స్లెడ్జింగ్ కి దిగాడు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ గుజరాత్ జట్టుని కొంపముంచింది. దీనికి సంజు శాంసన్ మాటలతో కాకుండా బ్యాట్ తోనే దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు. ఆ జట్టు మెయిన్ బౌలర్ రషీద్ ఖాన్ ని టార్గెట్ చేసుకొని వరుసపెట్టి సిక్సర్లు కొడుతూ స్టేడియంని హోరెత్తించాడు. దీంతో ఒత్తిడిలో పడిపోయిన గుజరాత్ చివరికి ఓటమిని కొని తెచ్చుకుంది.
హార్దిక్ ఇలా ప్రత్యర్థి ఆటగాళ్ల మీదకి దూసుకెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు అతి దూకుడుని ప్రదర్శించి పరువు పోగొట్టుకున్నాడు. ఇక ఆ సంగతి అలా ఉంచితే.. సొంత జట్టులో ప్లేయర్లకే హార్దిక్ గౌరవం ఇవ్వడని తెలుస్తుంది. ఇదివరకే షమీతో సహా పలువురు ఆటగాళ్లు హార్దిక్ ప్రవర్తన కారణంగా అసహనానికి గురయ్యారు. జట్టు విజయాలు సాధిస్తుందంటే దానికి కారణం ఆశిష్ నెహ్రా. మైదానం వెలుపల ఉంటూ కూడా ఎప్పటికప్పుడు ఆటగాళ్లకు విలువైన సలహాలు ఇస్తూ ఉంటాడు. జట్టులోని లోపాల గురించి, తుది జట్టు ఎలా ఉండాలో అంతా నెహ్రానే చూసుకుంటాడు. జట్టు గెలవడం కోసం అనుక్షణం తపిస్తూ ఉంటాడు. కానీ పాండ్య మాత్రం ఇదంతా నా వలనే సాధ్యమవుతుంది అనే భ్రమలో బ్రతుకుతున్నాడు.
Why Ashish Nehra disturb players on boundary after every over. Why can’t Hardik Pandya does captaincy on his own. Why do Ashish Nehra act like a football coach. Lots of questions to be asked now. Experts needs to look at this too. #GTvsRR pic.twitter.com/WEPsy8ld95
— Vikram Rajput (@iVikramRajput) April 16, 2023
ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో నెహ్రా ని కూడా లెక్క చేయడమో అనే సందేహం కలుగుతుంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో భాగంగా కోహ్లీ మాట వినకుండా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇలా సీనియర్ల మాట గౌరవించకుండా హార్దిక్ తన ఓవర్ ఆటిట్యూడ్ తో అందరి నుండి విమర్శలు మూట కట్టుకుంటున్నాడు. దూకుడు ఉండాలి కానీ మరీ ఇంతలా ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం ఐపీఎల్ లోనే కాదు టీమిండియాలో కూడా కొనసాగడం కష్టం. మరి ఇవన్నీ తెలుసుకొని ఇకనైనా తన ఆటిట్యూడ్ ని మార్చుకుంటే మంచిది.