క్రికెట్లో స్లెడ్జింగ్ చేయడం మామూలే. ఆస్ట్రేలియా జట్టును దీనికి పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆసీస్ అనే కాదు.. మిగతా జట్ల ఆటగాళ్లు కూడా స్లెడ్జింగ్‌కు దిగుతుండటం చూస్తున్నాం. అయితే కొందరు ప్లేయర్లు మాత్రం స్లెడ్జింగ్‌కు మాటలతో కాకుండా బ్యాట్‌తో సమాధానం ఇస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
గతేడాది టైటిల్ విన్నర్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ పదహారో సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విక్టరీ కొట్టింది. అయితే ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లో రెండు పరాజయాలను మూటగట్టుకుంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 రన్స్ చేసింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (45) తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. జట్టుకు శుభారంభాన్ని అందించాడు.
హార్డ్ హిట్టర్ మిల్లర్ (46) కూడా ఆకట్టుకున్నాడు. సారథి హార్దిక్ పాండ్యా (28)తో పాటు అభినవ్ మనోహర్ (13 బాల్స్‌లో 27) కూడా రాణించడంతో టైటాన్స్ మంచి స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (1), జోస్ బట్లర్ (0) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. అయితే దేవ్‌దత్ పడిక్కల్ (26), సంజూ శాంసన్ (32 బాల్స్‌లో 60) జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత హెట్మెయిర్ (26 బాల్స్‌లో 56) టీమ్‌ను విజయతీరాలకు చేర్చాడు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్, హెట్మెయిర్ విధ్వంసక బ్యాటింగ్‌తో పాటు ఒక ఆసక్తికర సన్నివేశం కూడా చోటుచేసుకుంది.
రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో ఓపెనర్లు త్వరగా ఔటవ్వడంతో సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చాడు. ఆ టైమ్‌లో అతడి దగ్గరకు వచ్చిన ప్రత్యర్థి కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంజూ చెవిలో ఏదో చెప్పాడు. దీనికి శాంసన్ జవాబివ్వలేదు. సీరియస్‌గా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. గుజరాత్ బౌలర్లను చితగ్గొట్టాడు. స్నిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనైతే వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఎవరితో బౌలింగ్ చేయించాలో తెలియక మిన్నకుండిపోయాడు హార్దిక్. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై సంజూ ఫ్యాన్స్ స్పందిస్తూ.. తమ అభిమాన క్రికెటర్‌ను స్లెడ్జింగ్ చేస్తే ఇలాగే ఉంటుందని అంటున్నారు. హార్దిక్.. మరోసారి సంజూతో పెట్టుకోకు అంటూ సలహాలు ఇస్తున్నారు.
— Cricbaaz (@cricbaaz21) April 16, 2023
Action speaks louder than voice
Hardik Pandya tried to sledge Sanju Samson and rest is history 💪. Rajasthan Royals won the match with 4 balls to spare and table toppers 🔥. Never mess with #SanjuSamson#RRvsGT #GTvRR pic.twitter.com/DOfTNqUmD6— Roshmi 💗 (@CricketwithRosh) April 16, 2023
Attack MODE 🔛! @IamSanjuSamson took on Rashid Khan & how 👌 👌
Watch those 3⃣ SIXES 💪 🔽 #TATAIPL | #GTvRR | @rajasthanroyals
Follow the match 👉 https://t.co/nvoo5Sl96y pic.twitter.com/0gG3NrNJ9z
— IndianPremierLeague (@IPL) April 16, 2023