ధోనీ మాస్టర్ ప్లాన్ దెబ్బకు హార్దిక్ బలైపోయాడు. ఎంతో అనుభవమున్నోడు కాస్త సింపుల్ గా ఔటైపోయాడు. ఇంతకీ ధోనీ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలేం జరిగింది?
‘అడవిలో పులితో జాగ్రత్తగా ఉండాలి. చెన్నైతో మ్యాచ్ అంటే ధోనీతో కేర్ ఫుల్ గా ఉండాలి’.. ఇదేదో పంచ్ కోసం చెప్పలేదు. ధోనీ ఏంటో ఒక్క మాటలో చెప్పాను. ఎందుకంటే ధోనీ ప్రత్యర్థి టీమ్ లో ఉన్నారంటే ఎంత పెద్ద స్టార్ అయినా భయపడతాడు. ఎక్కడో ఔట్ అయిపోతానో అని టెన్షన్ పడతాడు. చెప్పాలంటే ధోనీ.. టెన్షన్ పడేలా చేస్తాడు. ఎందుకంటే అక్కడున్నది ధోనీ కాబట్టి. మనోడి మాస్టర్ ప్లాన్ దెబ్బకు స్టారాది స్టార్ క్రికెటర్లకే ఏం చేయాలో అర్థం కాక ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు సేమ్ అలాంటిదే హార్దిక్ పాండ్య విషయంలోనూ జరిగింది. ఆ విషయమే ఐపీఎల్ ఫ్యాన్స్ మధ్య డిస్కసన్ కి కారణమైంది.
అసలు విషయానికొచ్చేస్తే.. చెన్నై టీమ్ జూలు విదిల్చింది. లీగ్ దశలో పడుతూ లేస్తూ ఆడింది. కానీ కీలకమైన క్వాలిఫయర్-1లో మాత్రం అద్భుతమైన విజయం సాధించింది. గుజరాత్ ని ఓడించి, ఫైనల్ కి దూసుకెళ్లింది. ఇలా తుదిపోరుకు సీఎస్కే అర్హత సాధించడం ఇది పదోసారి. ఓవరాల్ గా 14 సీజన్లలో ఆడిన చెన్నై జట్టు.. 12 సార్లు ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టడం మరో విశేషం. ఇలా ఇన్నేళ్లపాటు సక్సెస్ ఫుల్ విజయాలు సాధిస్తోంది అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ధోనీ. అతడి కెప్టెన్సీతోపాటు మాస్టర్ మైండ్ వల్లే సీఎస్కే సక్సెస్ కి కేరాఫ్ గా మారింది. ఇప్పుడు అలాంటి ఓ థియరీనే హార్దిక్ పాండ్య విషయంలో అమలు చేశాడు.
తాజాగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కాదు కాదు ఔట్ అయిపోయేలా ధోనీ చేశాడని చెప్పొచ్చు. 6వ ఓవర్ తీక్షణ బౌలింగ్ చేస్తున్నాడు. క్రీజులో హార్దిక్ ఉన్నాడు. దీంతో ధోనీ మైండ్ పాదరసంలా పనిచేసింది. లెగ్ సైడ్ ఉన్న ఫీల్డర్ ని తీసుకొచ్చి ఆఫ్ సైడ్ పెట్టాడు. అంటే మొత్తం ఆరుగురిని ఆఫ్ సైడ్ పెట్టాడు. తీక్షణ ఆఫ్ సైడ్ బంతి వేయగా.. తన వికెట్ కోసం స్కెచ్ వేశారని తెలిసినా సరే హార్దిక్ షాట్ కొట్టాడు. జడేజా చేతికి చిక్కాడు. ఇక్కడ ఈగోకి పోయి హార్దిక్ వికెట్ సమర్పించుకున్నాడు. ఒకవేళ ఇతడే క్రీజులో ఉండుంటే గుజరాత్ గెలిచే ఛాన్సు ఉండేదేమో. మరి హార్దిక్ ని రెచ్చగొట్టి మరీ ఔటయ్యేలా ధోనీ ప్లాన్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
👀 Dhoni moved a fielder to the off-side a ball prior to Hardik getting dismissed! #GTvCSK #TATAIPL #Qualifier1 #IPLonJioCinema pic.twitter.com/oJow2Vp2rj
— JioCinema (@JioCinema) May 23, 2023