గుజరాత్ టైటాన్స్ కి హార్దిక్ పాండ్య పాత్ర మరువలేం. గతేడాది టైటాన్స్ కి టైటిల్ అందించిన పాండ్య.. ఈ ఏడాది కూడా వరుస విజయాలతో జట్టుని సమర్ధవంతంగా నడుపుతున్నాడు. అయితే హార్దిక్ మొదట్లో వేరే జట్టుకి ఆడాలనుకున్నాడంట. మరి ఆ జట్టు ఏంటి?
ఐపీఎల్ లో గుజరాత్ జట్టు అదరగొడుతుంది. గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హార్దిక్ సేన ఏకంగా ట్రోఫీనే ఎగరేసుకుపోయింది. తొలి ప్రయత్నంలోనే టైటిల్ గెలిచి అండర్ డాగ్ అనుకున్న వారికి అనుకోని షాక్ ఇచ్చింది. 2022 లో చూపించిన జోరే ఈ ఏడాది కూడా కొనసాగిస్తోంది. జట్టు విజయాల్లో హార్దిక్ పాండ్య పాత్ర ఎలాంటిదో మనకు తెలిసిందే. కెప్టెన్ గా, బ్యాటర్ గా, బౌలర్ గా సత్తా చాటాడు. అప్పటివరకు ఫామ్ లో లేని హార్దిక్ అనూహ్యంగా చెలరేగి ఆడాడు. దీంతో ఒక్కసారిగా మునుపటి ఫామ్ ని అందుకున్న హార్దిక్ మరింతగా రాటుదేలాడు. అయితే హార్దిక్ పాండ్య మొదట్లో లక్నో జట్టుకి ఆడదామని అనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా పాండ్య చెప్పడంతో ఆసక్తికరంగా మారింది.
2021 వరకు 8 లేదా 9 జట్లతోనే ఐపీఎల్ కొనసాగింది. అయితే 2022 నుంచి 10 జట్లతో ఐపీఎల్ కి మరింత హైప్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కో జట్టులో గరిష్టంగా నలుగురు ప్లేయర్లను మాత్రమే రెటైన్ తీసుకోవాలి అనే ప్రతిపాదన వచ్చినప్పుడు మిగిలిన ప్లేయర్లను రిలీజ్ చేయాల్సి వచ్చింది. దీంతో అందరూ మళ్ళీ కొత్తగా వేలంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో లక్నో , గుజరాత్ అనే మరో రెండు జట్లను తీసుకొని వచ్చారు. లక్నో టీమ్ కి రాహుల్ , గుజరాత్ టీమ్ కి హార్దిక్ పాండ్య కెప్టెన్ గా ఫ్రాంచైజీలు తెలిపాయి. ఇదిలా ఉండగా మొదట్లో లక్నో జట్టుకి ఆడాల్సిందిగా హార్దిక్ కి ఫోన్ కాల్ వచ్చిందని సమాచారం. తన మిత్రుడు రాహుల్ ఉన్న జట్టుకే పాండ్య ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.
సందర్భంగా హార్దిక్ మాట్లాడుతూ.. “ముంబై ఇండియన్స్ నన్ను వదిలేసినప్పుడు లక్నో జట్టునుండి నాకు ఫోన్ వచ్చింది. ఆ జట్టుకు ఆడాల్సిందిగా తెలిపారు. ఆ జట్టుకి నా మిత్రుడు రాహుల్ కెప్టెన్ కావడంతో లక్నో జట్టుకి ఆడాలని అనుకున్నాను. ఆ తర్వాత ఆశిష్ నెహ్రా నుండి ఫోన్ రావడంతో నా మనసు మార్చుకున్నాను. అప్పటికి గుజరాత్ జట్టు ఐపీఎల్ ఆడేందుకు అనుమతి రాలేదు. పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంది. ఆ సమయంలో నెహ్రా దగ్గర నుండి నాకు ఫోన్ వచ్చింది”.
“గుజరాత్ జట్టు ఐపీఎల్ ఆడడంలో ఇంకా స్పష్టత రాకపోయినా.. నేనే కోచ్ గా ఉండబోతున్నాను అని నెహ్రా నాకు చెప్పాడు. దానికి నేను ఒకటే చెప్పాను. ఆశు ఫా మీరు లేకపోతే గుజరాత్ జట్టులో ఉండడానికి అంగీకరించేవాడిని కాదు. మీకన్నా నన్ను ఎవరూ బాగా అర్ధం చేసుకోలేరు అని చెప్పాను. మా ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ తర్వాత గుజరాత్ కెప్టెన్ గా ఉంటావా అనే మెసేజ్ వచ్చింది. నేను షాకయ్యను”. అని ఆనాటి పరిస్థిలుతులని గుర్తు చేసుకున్నాడు. మరి హార్దిక్ నిర్ణయం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.